అమరావతిని నాశనం చేయడానికి వైకాపా ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. అందుకే జరగని అవినీతిని జరిగినట్లుగా చూపాలని విశ్వ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన వైకాపా.... అధికారంలోకి వచ్చాక ఏం తేల్చిందని నిలదీశారు.
సీఆర్డీఏ పరిధి కూడా తెలుసుకోకుండా... తెదేపా నేతలు భూములు కొన్నారని వైకాపా ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని బొండా ఉమా మండిపడ్డారు. ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలతో ఆగకుండా.... ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు భూములు కాజేశారని ఆరోపించారు. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి హిందూ మతంపై దాడి ప్రారంభించారని ఆరోపించారు.
ఇదీ చదవండి