ETV Bharat / city

'తెలుగుపై కుట్రే ఇది.. ఉద్యమిద్దాం రండి' - తెలుగు-సంస్కృత అకాడమీ

కేవలం రాజకీయ పదవులు సృష్టించడం కోసం తెలుగు అకాడమీని తెలుగు-సంస్కృత అకాడమీగా మార్చారని తెలుగు భాషోద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ సామల రమేష్‌బాబు, ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి డాక్టర్‌ వెన్నిశెట్టి సింగారావు మండిపడ్డారు. దీని వల్ల తెలుగు ఔనత్యం దెబ్బతినడమే కాకుండా హైదరాబాద్​లో అకాడమీకి ఉన్న వందల కోట్ల ఆస్తులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.

telugu academy
తెలుగు అకాడమీ
author img

By

Published : Jul 15, 2021, 8:02 AM IST

'తెలుగు అకాడమీ ఐదు దశాబ్దాలకు పూర్వం ఏర్పడింది. తెలుగు భాష సాంస్కృతిక పునరుజ్జీవానికి అది కృషి చేస్తోంది. ఇప్పుడు ఆ కృషిని, భాషను నాశనం చేసేందుకే తెలుగు అకాడమీని.. తెలుగు-సంస్కృత అకాడమీగా మార్చారు' అని తెలుగు భాషోద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ సామల రమేష్‌బాబు, ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి డాక్టర్‌ వెన్నిశెట్టి సింగారావు బుధవారం ఓ సంయుక్త ప్రకటనలో విమర్శించారు.

ఇది రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీని రద్దు చేస్తూ తెలుగు- సంస్కృత అకాడమీగా మార్పు చేయడం ద్వారా తెలుగు భాష ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తూ.. దాన్ని దశల వారీగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ దురాగతాన్ని తెలుగు భాషాభిమానులు, మేధావులు, రచయితలు, ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. అందరూ కలసికట్టుగా ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కోట్ల ఆస్తులు కోల్పోతాం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన తెలుగు అకాడమీకి హైదరాబాద్‌లో కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని, వాటిని వదులుకొని కేవలం రాజకీయ పదవులు సృష్టించడం కోసం తెలుగు-సంస్కృత అకాడమీని స్థాపించారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన రూ.వందల కోట్ల నిధులను, ఆస్తులను కోల్పోవడమే కాకుండా తెలుగు భాషాభివృద్ధికి చేపట్టవలసిన చర్యలు మరుగునపడిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా తెలుగు అకాడమీ ద్వారా భాషాభివృద్ధి కోసం చేసిన కృషి శూన్యమని ఆరోపించారు. ఇప్పటికైనా అనాలోచిత నిర్ణయాలపై పునరాలోచించి జీవో నంబర్‌ 21ని రద్దు చేసి తెెలుగు అకాడమీ పునర్‌వైభవానికి, భాషాభివృద్ధికి కృషి చేయాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: kilaru roshaiah: 'తెదేపా హయాంలోని అవినీతి ప్రస్తుతం బయటపడుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.