మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలకు కనీస మద్దతు ధరను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ జాబితాలో లేని పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ధరల స్థిరీకరణ నిధి ధ్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల వ్యత్యాసాలను భరించాలని ఉత్తర్వుల్లో పేర్కోంది. మిరపకు ఒక్కో క్వింటాలుకు 7 వేల రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించింది. పసుపు క్వింటాలుకు 6350 రూపాయలుగా నిర్ధారించారు. ఉల్లి క్వింటాలుకు 770 రూపాయలుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక చిరుధాన్యాలైన కొర్రలు, అరికెలు, వరిగ, వూదలు, సామలకు క్వింటాలు 2500 చొప్పున మద్దతు ధర నిర్ధారించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఇదీ చదవండి: