కోవిడ్ బాధితులకు సలహాలు, సహాయ కార్యక్రమాలు నిర్వహించేందుకు కోవిడ్ సేవా సెల్‌ను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని సెల్ ఇంఛార్జ్, భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం భాజపా రాష్ట్ర కార్యాలయంలో వెల్లడించారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, ఆసుపత్రుల్లో పడకలు, ఇంజక్షన్లు, టీకాల సమస్యలపై కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన బాధితులకు సలహాలు, సూచనలు చేసేందుకు ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందన్నారు.
కోవిడ్ బాధితులకు చికిత్సకోసం ఏర్పాటుచేసిన 104 సర్వీసు క్రియాశీలకంగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. 104 సర్వీసు మరింత బాగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 23 నెలలుగా 85 వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఖర్చుచేసిన రాష్ట్ర ప్రభుత్వానికి... రూ.1,600 కోట్లు పెద్ద మొత్తం కాదని, వెంటనే అడ్వాన్సులు చెల్లించి టీకాలు తెప్పించి అవసరమైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
సీఎం జగన్ ఆస్తుల కేసు.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ వాయిదా