రాష్ట్రవ్యాప్తంగా 16,345 విద్యాసంస్థల్లో రూ.4,446 కోట్లతో రెండో విడత ‘నాడు-నేడు’ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం పాఠశాలలకు విద్యాశాఖ పరిపాలన అనుమతులతో పాటు మార్గదర్శకాలను విడుదల చేసింది. నిర్మాణ పనులను విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలు నిర్వహిస్తాయి. ఎక్కడైనా ఈ కమిటీలు పనులు చేయలేకపోతే అక్కడ టెండర్లు పిలుస్తారు. పనులకు ముందుగా 15% రివాల్వింగ్ ఫండ్ ఇస్తారు.
ప్రత్యేక సాంకేతిక విభాగం
పనులు చేపట్టేందుకు 28 మంది అధికారులతో ప్రత్యేకంగా సాంకేతిక సహాయ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. శిథిలావస్థలో ఉన్న విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇస్తారు. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ఛైర్మన్‌గా, సంచాలకులు కన్వీనర్‌గా 19మందితో రాష్ట్రస్థాయి కమిటీ ఉంటుంది. 250 మందికి పైగా విద్యార్థులుంటే అర్కిటెక్ట్‌తో ప్రణాళిక రూపొందిస్తారు. నాబార్డు, ప్రపంచ బ్యాంకు ఇచ్చే నిధులను వినియోగించనున్నారు. 10% మండలాల్లో నమూనాగా ఆడిట్ నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: మువ్వన్నెలు విరిసిన వేళ..శత వసంతాల హేల..!