క్వింటాలు పత్తి మంగళవారం గరిష్ఠ(Cotton Price Hike) ధర పలికింది. తెలంగాణ వరంగల్ జిల్లా నెక్కొండలో అత్యధికంగా రూ. 8,350 లభించింది. మరో నాలుగు జిల్లాల్లోనూ 8 వేల మార్కును దాటింది. ఈ ప్రభావంతో ఈసారి కొనుగోళ్ల(Cotton Price Hike) కు సీసీఐ మంగళం పాడుతోంది. మద్దతు ధర కన్నా రూ.2 వేలు ఎక్కువ పలుకుతుండటంతో ఇక సీసీఐ కొనుగోళ్లు లేనట్లేనని జిల్లాల యంత్రాంగాలు అంటున్నాయి.
తేమ ఉన్నా మంచి ధరే
అంతర్జాతీయ విపణిలో పత్తి(Cotton Price Hike) కి భారీగా డిమాండ్ ఉంటున్నా... అనుకున్న రీతిలో దిగుబడులు లేకపోవడంతో ఈ సీజన్లో పెద్ద ఎత్తున ధరలు వస్తున్నాయి. కొనుగోళ్లపై సీసీఐ ఆసక్తి చూపకపోవడంతో అన్నిచోట్లా ప్రైవేటు వ్యాపారులే పత్తి(Cotton Price Hike) ని కొంటున్నారు. ఈ సీజన్‌కు రాష్ట్రంలో 42 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారం సాగవగా 3 కోట్ల క్వింటాళ్ల దిగుబడులు ఉంటాయని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా 376 జిన్నింగ్ మిల్లులుండగా సీసీఐ(Cotton Price Hike) కొనుగోళ్లు లేకపోవడంతో వాటన్నింట్లోనూ అక్కడి యజమానులే పంటను కొంటున్నారు. సోమవారం ఉదయం రూ. 7,600 ఉన్న ధర సాయంత్రానికి మరో రూ. 100 పెరిగింది. ఆదివారం ఉదయం క్వింటాకు రూ. 7,500, సాయంత్రం రూ. 7,600 పలికింది. ఇలా రెండు రోజులపాటు ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనపడగా మంగళవారం మాత్రం ఊహించని స్థాయికి చేరుకుంది. అటు సీడ్ ధరలు సైతం ఈసారి అనూహ్యంగా పెరిగాయి. క్వింటాలుకు రూ. 3,400 లభిస్తోంది. ఇది గతేడాది గరిష్ఠంగా రూ. 2,100 మాత్రమే పలికింది.
రికార్డు స్థాయిలో
వరంగల్ జిల్లా నెక్కొండలో మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా తెల్ల బంగారం(Cotton Price Hike) క్వింటాకు 8 వేల 350 రూపాయలు పలికింది. గత కొన్నేళ్లలో ఈ స్థాయి ధరలు చూడలేదని అధికారులు అంటున్నారు. గజ్వేల్‌లో రూ. 8,261, జమ్మికుంట, నారాయణపేటలో రూ. 8,150, ఆదిలాబాద్‌లో రూ. 8,020 దక్కింది. ఇక అత్యల్పంగా నారాయణఖేడ్‌లో రూ. 6,025 పలికింది. నారాయణఖేడ్‌లో దక్కిన ధర ఎంఎస్పీ(MSP)తో సమానంగా ఉంది.
రైతుల ఆశలు చిగురించే
ధరలు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా సాగుదారులు సైతం పంటను(Cotton Price Hike) వెంటనే విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈసారి దిగుబడులు సగానికి సగం తగ్గినా చేతికందిన పంటయితే నాణ్యంగా ఉంది. ఆగస్టులో వర్షాల వల్ల చేలల్లో నీరు చేరి... పంట పనికిరాకుండా పోయింది. అటు పెట్టుబడులు, కౌలు ధరలు పెరగడంతో రైతన్నలు అప్పులు తెచ్చి పత్తిని కాపాడుకోవాల్సి వచ్చింది. అందిన అరకొర దిగుబడులకైనా ఇప్పుడు మంచి ధరలు చేతికి అందుతుండటంతో సాగుదారుల్లో ఉపశమనం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: