దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో నాలుగు రోజుల పాటు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. తూర్పు బిహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆగ్నేయ మధ్యప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం 15 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
ఇవీ చదవండి...కాల్చే ఆకలి....కూల్చే వేదన