ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటైన లోకాయుక్త కార్యాలయం ఇప్పటి వరకూ 398 కేసులను విచారణ చేపట్టిందని ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి స్పష్టం చేశారు. లోకాయుక్త కార్యాలయం ప్రారంభమైన సెప్టెంబరు 16 తేదీ నుంచి 30 తేదీ వరకూ మొత్తం లోకాయుక్త సంస్థకు 448 ఫిర్యాదులు వచ్చాయని... ఇందులో 50 ఫిర్యాదుల్లో సరైన వివరాలను లేని కారణంగా తిరస్కరించినట్టు ప్రకటనలో వెల్లడించారు. 215 కేసుల్లో సంబంధిత శాఖల అధికారుల నుంచి నివేదికలు కోరామని చెప్పారు. మరో 183 కేసుల్లో తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు సూచనలు జారీ చేసినట్టు లోకాయుక్త తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకాయుక్త పని చేయటం ప్రారంభించినప్పటికీ విజయవాడలో ఇంకా కార్యాలయం నిర్మాణంలో ఉన్నందున హైదరాబాద్లోని బషీర్బాగ్లో తాత్కాలికంగా లోకాయుక్త కార్యాలయం పని చేస్తోందని జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి స్పష్టం చేశారు.
"15 రోజుల్లో... 398 కేసుల విచారణ" - ఏపీ లోకాయుక్త
రాష్ట్రంలో లోకాయుక్త ఏర్పాటయ్యాక 448 ఫిర్యాదులు వచ్చాయని జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి చెప్పారు. వాటిల్లో 50 మినహా మిగతా వాటిని విచారించామన్నారు.