ETV Bharat / city

ఆన్‌లైన్‌లో ఇంటర్‌ పాఠాలు....జూన్‌ నుంచి అందుబాటులోకి..! - kovid news in ap

కొవిడ్ కారణంగా రాబోయే విద్యాసంవత్సరం ప్రారంభం ఆలస్యమైతే ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహించేందుకు ఇంటర్‌ శాఖ సిద్ధమవుతోంది. ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు... ఆన్​లైన్​ క్లాసులు జూన్‌ నుంచి అందుబాటులోకి వస్తాయి.

The Inter Department is preparing to conduct online classes if the start of the next academic year is delayed due to Kovid.
కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో ఇంటర్‌ పాఠాలు
author img

By

Published : May 3, 2020, 7:51 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైతే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మొత్తం పాఠాలను నిపుణులైన లెక్చరర్లతో వీడియో రికార్డు చేయించనున్నారు. ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. వీటిని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా వినియోగించుకోవచ్చు. జూన్‌ నుంచి ఆన్‌లైన్‌ వీడియోలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు ఏదైనా పాఠం అర్థం కాకపోయినా, రెడ్‌జోన్‌లో ఉండి తరగతులకు హాజరుకాలేని వారు సైతం వాటిని వినియోగించుకోవచ్చు.

రూపకల్పన ఇలా..

  • ఒకపాఠంపై ముగ్గురు, నలుగురు లెక్చరర్ల నుంచి పాఠ్యాంశాలు (కంటెంట్‌) స్వీకరిస్తారు. ఎంపికైన వారినుంచి పాఠం రికార్డు చేస్తారు.
  • తేలికగా అర్థమయ్యేందుకు అవసరమైన వీడియోలను జత చేస్తారు.
  • ఇంటర్‌ అకడమిక్‌ జూన్‌నుంచి ప్రారంభమవుతుంది. ఆ నెలకు ఒక్కో సబ్జెక్టు నుంచి 3 పాఠాలు అవసరం కానున్నాయి. ముందు వాటిని పూర్తి చేస్తారు.
  • మొదటి ఏడాది ప్రవేశాలు జాప్యం కానున్నందున ముందుగా రెండో ఏడాది పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఇవీ చదవండి...కరోనా కాలంలో.. ఆమె సేవలు అసాధారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.