రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయాలని టీడీపీ నేత జీవీ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. స్థానిక సంస్థలకు నిధుల విషయంలో సిఫార్సు చేసే.. రాజ్యాంగ బద్ధ సంస్థ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పదవీకాలం 2020తో ముగిసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక సంఘం నియమించ లేదని పిటిషనర్ న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు.
కమిషన్‍ను నియమించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని న్యాయవాది తెలిపారు. వెంటనే స్టేట్ ఫైనాన్స్ కమిషన్‍ను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ, మున్సిపల్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: