High Court on NTR health Varsity: జవాబుపత్రాలను డిజిటల్ విధానంలో మూల్యాంకన విధానంపై అవగాహన ఉన్న బాధ్యులైన ఓ అధికారి, టెక్నిషియన్ విచారణకు హాజరుకావాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత రికార్డులతో మార్చి 4న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఎన్టీఆర్ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రారును ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈమేరకు ఆదేశాలిచ్చారు.
2021 జులైలో పీజీ కోర్సుల పరీక్షల జవాబుపత్రాలను హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారని పేర్కొంటూ డాక్టర్ వి.ప్రేమలత హైకోర్టులో వ్యాజ్యం చేశారు. గత ఏడాది డిసెంబర్ 24 న విచారణ జరిపిన కోర్టు బాధ్యులైన అధికారి జనవరి 6న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఆరోజు విచారణకు అధికారి కాకపోవడంతో జనవరి 19కి వాయిదా వేసింది. అరోజున అధికారి హాజరుకాలేదు. తాజాగా జరిగిన విచారణకు వర్సిటీ అధికారులు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన న్యాయమూర్తి .. మార్చి 4న విచారణకు హాజరుకావాలని రిజిస్ట్రారును ఆదేశించారు.
ఇదీ చదవండి :
High Court on Wakf Board : వక్ఫ్ బోర్డు సభ్యులకు, సీబీఐకి హైకోర్టు నోటీసులు