ETV Bharat / city

high court:'ఆస్తి పన్ను కొత్త చట్టాన్ని కోర్టు ముందు ఉంచండి'

మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధించేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసి గెజిట్,సంబంధించిన జీవోను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆర్డినెన్స్ తదనంతరం చట్ట రూపం దాల్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం చట్టం ప్రతిని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.

high court
high court
author img

By

Published : Sep 7, 2021, 2:58 AM IST

మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధించేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసి గెజిట్, సంబంధించిన జీవోను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది శివాజీ వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారానికి సంబంధించిన ఆర్డినెన్స్ తదనంతరం చట్ట రూపం దాల్చిందని తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం చట్టం ప్రతిని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

కొత్త విధానంతో ఆస్తి పన్ను విధించేందుకు వీలుకల్పిస్తు గతేడాది నవంబర్ 24 న జారీచేసిన గెజిట్ ప్రకటన, అదే రోజు జారీచేసిన జీవో 198, సంబంధిత ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరతూ 'అవగాహన సంస్థ' కార్యదర్శి శివరామిరెడ్డి, ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, మరికొందరు హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజారాం వాదనలు వినిపిస్తూ .. ఆర్డినెన్స్ జారీ అనంతరం నిర్దిష్ట సమయంలో శాసన సభ ముందు ఉంచి సంబంధిత అంశాన్ని ఆమోదింపచేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆ విధానం పాటించనందున ఆర్డినెన్స్ కాల వ్యవధి గతించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఆర్డినెన్స్ తదనంతరం చట్టం రూపం దాల్చినట్లు అధికారుల నుంచి సమాచారం అందిందన్నారు. అందుకు సంబంధించిన వివరాల్ని కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలన్నారు. ఆ అభ్యర్థనకు ధర్మాసనం అంగీకరించింది.

ఇదీ చదవండి

TRANSGENDER: ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్​పై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.