బహిరంగ ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాలు , మండపాలు ఏర్పాటుకు అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కొవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలు సమర్థనీయమేనన్న హైకోర్టు... ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టుకోవడానికి నిరాకరిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఈ నెల 2 న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయవాది , విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి సిద్దినేని శ్రీసత్యం సాయిబాబు హైకోర్టులో పిల్ వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ... ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టేసింది .
ఇదీ చదవండి