తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సింగంరావు పవన్‌కుమార్(34)కు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన యువతితో శనివారం ఉదయం 11 గంటలకు వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం గున్‌గల్‌లో పవన్‌కుమార్‌ను పెళ్లికొడుకును చేశారు.
కొద్దిసేపటికే ఆయన చలితో వణికిపోసాగారు. ఆయన సోదరుడు కిరణ్‌కుమార్ కారులో రాత్రి 11 గంటలకు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కిరణ్‌కుమార్ ఇటీవల కరోనాతో వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది.. 5 రోజుల క్రితం ఇంటికి వచ్చారు. పవన్‌కుమార్ మృతికి కొవిడ్ కారణమై ఉంటుందని గ్రామస్థులు అనుమానిస్తున్నారు.