ETV Bharat / city

సైకిల్​పై ఫుడ్​ డెలివరీ.. దాతల సాయంతో కొత్త బైక్

కరోనా మహమ్మారి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నా పేద, మధ్య తరగతి ప్రజలు ఏదో ఒక విధంగా తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి అన్నట్లుగా జీవనోపాధి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అదే బాటలో తెెలంగాణలోని హైదరాబాద్​కు చెందిన ఓ ఇంజనీరింగ్​ విద్యార్థి మహ్మద్​ అకీల్​.. తన కుటుంబ పోషణ కోసం జొమాటాలో డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. బైక్​ లేకపోయినా సైకిల్​పై దాదాపు 80కి.మీలు ప్రయాణిస్తూ ఫుడ్​ డెలివరీ చేస్తున్నాడు. అతని కష్టాన్ని గుర్తించిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల ద్వారా నిధులు సమకూర్చారు. అకీల్​ కోసం బైక్​ కొనుగోలు చేసి కానుకగా ఇస్తున్నారు.

food  delivery
సైకిల్​పై ఫుడ్​ డెలివరీ
author img

By

Published : Jun 16, 2021, 5:30 PM IST

తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మహ్మద్ అకీల్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి చెప్పులు తయారు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లాక్​డౌన్​ ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అకీల్​ జొమాటోలో ఫుడ్​ డెలివరీ బాయ్​లా జాయిన్ అయ్యాడు. బైక్​ లేకపోయినా సైకిల్​పై దాదాపు 80 కి.మీలు ప్రయాణిస్తూ ఫుడ్​ డెలివరీ చేస్తున్నాడు. సైకిల్​పై అన్ని కిలోమీటర్లు వెళ్లడం కష్టమైనా తన కుటుంబ పోషణ కోసం తప్పదని.. తాను ఇంకా బాగా చదువుకోవాలనుకుంటున్నానని 'ఈటీవీ భారత్'​తో అకీల్​ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

food  delivery
దాతల సాయంతో కొత్త బైక్

'ఈటీవీ భారత్‌ ఉర్దూ'లో ప్రసారమైన కథనాన్ని చూసి 'ది గ్రేట్​ హైదరాబాద్​ ఫుడ్ అండ్ ట్రావెల్​ క్లబ్​ ' అకీల్​కు సాయం చేయాలని నిర్ణయించుకుంది. అకీల్​కు బైక్​ కొనివ్వడం కోసం ఆ సంస్థ సభ్యుడు రాబిన్​ ముకేష్​.. సామాజిక మాధ్యమాల ద్వారా విరాళాలు సేకరించారు. 24 గంటల్లోనే రూ. 73,370 సేకరించారు. ఈ డబ్బుతో అకీల్​కు రెండు రోజుల్లో ద్విచక్ర వాహనాన్ని కొనిస్తామని తెలిపారు. సాయం చేసిన దాతలకు, 'ది గ్రేట్​ హైదరాబాద్​ ఫుడ్ అండ్​ ట్రావెల్​ క్లబ్​ ' సంస్థకు, ఈటీవీ భారత్‌కు అకీల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: anandhayya medicine : అనుమతులు లేవని ఆనందయ్య మందు పంపిణీని అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.