ETV Bharat / city

రేషన్​ పంపిణీపై ప్రతిపక్షనేతగా విమర్శలు... సీఎంగా కోతలు

రేషన్‌ ద్వారా పేద ప్రజలకు ఇచ్చే వాటిలో ప్రభుత్వం కోతపెడుతోంది. మార్కెట్లో నిత్యావసరాలు రోజురోజుకూ చుక్కలనంటుతున్నా.. పేదల ఇంటి ఖర్చులు నెలనెలా పెరుగుతున్నారాయితీపై సరకులిచ్చి పేదలపై భారం తగ్గించాలనే ఆలోచన చేయడం లేదు.

రేషన్​ పంపిణీ
రేషన్​ పంపిణీ
author img

By

Published : Apr 29, 2022, 4:18 AM IST

రాష్ట్రంలో రేషన్‌ అంటే బియ్యమే. కందిపప్పు, పంచదార ఇస్తున్నామంటున్నా అవి అందేదీ కొందరికే. 2019కి ముందు వేర్వేరు నిత్యావసరాలను రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేసేవారు. అయితే బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదని, రేషన్‌ వ్యవస్థనే నీరుగార్చారని అప్పట్లో ప్రతిపక్షనేతగా రాష్ట్రమంతా తిరిగిన జగన్‌మోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. తాను ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక అప్పటికే ఇస్తున్న సరకుల్లో కోతలు మొదలుపెట్టారు. కొన్నింటిని ఆపేశారు. మరికొన్నింటి ధరల్ని 70% వరకు పెంచేశారు. అవీ పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. తద్వారా కార్డుదారులపై ఏడాదికి రూ.3,062.40 కోట్ల భారం మోపుతున్నారు. మార్కెట్లో నిత్యావసరాలు రోజురోజుకూ చుక్కలనంటుతున్నా, పేదల ఇంటి ఖర్చులు నెలనెలా పెరుగుతున్నా.. రాయితీపై సరకులిచ్చి పేదలపై భారం తగ్గించాలనే ఆలోచన కూడా చేయడం లేదు. రాగులు, జొన్న, కొర్రలు, సజ్జలు, సెనగలనూ మద్దతు ధరపై కొంటున్నామంటున్న ప్రభుత్వం.. వాటినీ తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు.

...

కందిపప్పు కుదించి.. ధర పెంచేశారు..

మూడేళ్ల కిందటి వరకు ఒక్కో రేషన్‌ కార్డుకు నెలకు రెండు కిలోల కందిపప్పును రాయితీపై కిలో రూ.40కి అందించేవారు. ప్రభుత్వం మారాక దాన్ని కిలోకు తగ్గించారు. పైగా 2020 జూన్‌ నుంచి కిలో రూ.67కు పెంచి, కార్డుదారుపై రూ.27 చొప్పున అదనపు భారం మోపారు. గతంలో రూ.80కి 2 కిలోల కందిపప్పు అందితే.. ఇప్పుడు రూ.182 (రేషన్‌లో కిలో రూ.67, మార్కెట్‌లో మరో కిలో రూ.115 చొప్పున) చెల్లించాల్సి వస్తోంది.

* ఒక్కో కార్డుదారుడికి నెలకు రూ.102

* రాష్ట్రంలోని 1.45 కోట్ల కార్డులకు నెలకు రూ.147.90 కోట్లు

* ఏడాదికి రూ.1,774.80 కోట్ల అదనపు భారం పడుతోంది.

* రాష్ట్రంలో కార్డుదారులకు నెలకు కిలో కందిపప్పు లెక్కన 14,521 టన్నులు అవసరం. దీనికి ఏడాదికి రూ.505.33 కోట్ల రాయితీ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే 60% మంది కార్డుదారులకు కూడా కందిపప్పు అందడం లేదు. ఏప్రిల్‌లో 7,737, మార్చిలో 3,768, ఫిబ్రవరిలో 5,508, జనవరిలో 6,520 టన్నులే ఇచ్చింది. ఈ లెక్కన రూ.505 కోట్ల రాయితీలో సగమే ఖర్చు చేస్తోంది.

చంద్రబాబు అధికారంలోకి రాక ముందు.. రేషన్‌ దుకాణానికి వెళ్తే బియ్యంతోపాటు చక్కెర, కందిపప్పు, పామోలిన్‌, గోధుమపిండి, గోధుమలు, కారం, పసుపు, ఉప్పు, చింతపండు, కిరోసిన్‌ దొరికేవి.. అన్నీ ప్యాక్‌ చేసి ఒక సంచిలో పెట్టి కేవలం రూ.185కే చేతికిచ్చేవాళ్లు. చంద్రబాబు సీఎం అయ్యాక రేషన్‌ దుకాణానికి వెళ్తే బియ్యం తప్ప ఏమైనా దొరుకుతుందా? గట్టిగా రెండు చేతులూ పైకెత్తి లేదని చెప్పండి.- ఎన్నికల ముందు ప్రజాసంకల్ప యాత్రలో ప్రతి చోటా జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాట ఇది..

గోధుమపిండికీ దిక్కు లేదా?

రేషను బండ్ల ద్వారా ఇంటింటికీ సరకులు పంపిణీ చేస్తున్నామంటున్న ప్రభుత్వం కార్డుదారులకు ఇచ్చే కనీస నిత్యావసరాలకూ కోత పెట్టింది. మూడేళ్ల కిందటి వరకు రేషన్‌ దుకాణాల ద్వారా కిలో రూ.16.50కు గోధుమపిండి ఇచ్చేవారు. ఇప్పుడు ఎత్తేశారు. దీంతో బహిరంగ మార్కెట్లో కిలో గోధుమపిండి రూ.40 పైగా పెట్టి కొనాల్సి వస్తోంది.

* రాష్ట్రంలో కార్డుదారులపై నెలకు రూ.58 కోట్లు

* ఏడాదికి రూ.696కోట్ల మేర భారంపడుతోంది

చేదెక్కిన పంచదార

2020 జూన్‌ వరకు రేషన్‌ కార్డుదారులకు అర కిలో పంచదారను రూ.10కి అందించేవారు. 2020 జులై నుంచి దానిపై రూ.7 (70%) పెంచేశారు.

* కార్డుదారులపై నెలకు రూ.10.15 కోట్లు

* ఏడాదికి రూ.121.80 కోట్లు భారం పడుతోంది.

* రాయితీపై నెలకు 7,715 టన్నుల పంచదార ఇస్తూ రూ.113.28 కోట్ల భారం భరిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటున్నా.. పంపిణీలో కోత పెడుతున్నారు. ఏప్రిల్‌లో 90 లక్షలు, మార్చిలో 1.02 కోట్లు, ఫిబ్రవరిలో 1.03 కోట్లు, జనవరిలో 61 లక్షల కార్డుదారులకే పంచదార ఇచ్చారు.

ఉప్పు బరువైంది

గతంలో డబుల్‌ ఫోర్టిఫైడ్‌ ఉప్పును కిలో రూ.12కి కార్డుదారులకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఇవ్వడం లేదు. బహిరంగ మార్కెట్లో దీని ధర కిలో రూ.27 ఉంది.

* కార్డుదారులపై నెలకు రూ.39.15 కోట్లు

* ఏడాదికి రూ.469.80 కోట్ల భారం పడుతోంది

గతంలో ఇచ్చిన రాగులు, సజ్జలు.. ఇప్పుడెందుకు ఇవ్వలేకపోతున్నారు?

ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా ప్రజల ఆహారపు అలవాట్లు మార్చేందుకు రాగులు, జొన్నలను కార్డుదారులకు రాయితీ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 2017-18లో 3,252 టన్నుల రాగుల్ని రేషన్‌ దుకాణాల ద్వారా పంచింది. తర్వాత దీన్ని జిల్లాల వారీగా విస్తరించింది. ఇప్పుడు వాటి పంపిణీయే లేదు.

* 2019-20లో రూ.1,587 కోట్లు, 2020-21లో రూ.4,904 కోట్లు, 2021-22లో రూ.27.60 కోట్లతో వివిధ రకాల పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొన్నట్లు ఇటీవల అసెంబ్లీలో చెప్పింది. అంటే రాగులు, సజ్జలు, జొన్నలు అందుబాటులో ఉన్నా రాయితీపై ఇవ్వడం లేదు.

* ఆరోగ్యం కోసం కొందరు కార్డుదారులు తమకు ఇచ్చే బియ్యాన్ని అమ్ముకుని రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు కొనుక్కుంటున్నారేమోనని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల పేర్కొన్నారు. అలాంటప్పుడు గతంలో మాదిరిగా రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు తదితరాలను పౌరసరఫరాలశాఖ ద్వారా ఎందుకు పంపిణీ చేయలేకపోతోందంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేషన్‌ దుకాణాల ద్వారా కుటుంబసభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం, కార్డుకు 2 కిలోల కందిపప్పు, అర కిలో చక్కెర, కిలో గోధుమపిండి, కిలో ఉప్పు ఇచ్చేవారు. బియ్యం బదులుగా చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రాగులు.. కర్నూలు, కడప, కృష్ణా(3 మండలాలు) జిల్లాల్లో జొన్నల పంపిణీ ప్రారంభించి 2018 అక్టోబరు తర్వాత రాష్ట్రమంతటా విస్తరించారు.

* జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబసభ్యుడికి 5 కిలోల బియ్యం, కార్డుకు అరకిలో చక్కెర ఇస్తున్నారు. నెలకు రెండు కిలోలిచ్చే కందిపప్పును కిలో చేశారు. కందిపప్పుపై 68%, పంచదారపై 70% చొప్పున ధరలు పెంచారు. అదీ కార్డుదారులందరికీ ఇవ్వడం లేదు. గోధుమపిండి, రాగులు, జొన్నలు, ఉప్పు తీసేశారు. వంటనూనెల ధరలు మండుతున్నా.. వాటిని పేదలకు రాయితీపై ఇద్దామనే ఆలోచనే కొరవడింది. కనీసం గోధుమలు కూడా ఇవ్వడం లేదు.

ప్రస్తుతం లీటరు పామాయిల్‌ ధర మార్కెట్లో రూ.160 పైమాటే. రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలవారు నెలకో లీటరు చొప్పున కొన్నా.. రూ.232 కోట్లు ఖర్చవుతోంది. అంటే ఏడాదికి రూ.2,784 కోట్లు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్‌ చెప్పిన రూ.185కే తొమ్మిది రకాల సరకుల్లో ఇదీ ఒకటి. 2014 ముందు అప్పటి ప్రభుత్వం లీటరు రూ.40 చొప్పున రాయితీపై అందించేది. ఆ లెక్కన ఇప్పుడు రాయితీ ఇచ్చినా.. వినియోగదారులకు ఏడాదికి రూ.2,088 కోట్లు ఆదా అవుతుంది. పామోలిన్‌ సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దీంతో రాష్ట్రంలో ఉన్న మిల్లుల నుంచి నూనె సేకరించడమూ ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు.

....

ఇదీ చదవండి : రేషన్‌ బియ్యానికి బదులు నగదు...నూరుశాతం వ్యతిరేకిస్తున్న కార్డుదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.