రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 195 కోట్ల రూపాయల మేర యాన్యుటీ చెల్లింపులకు నిధులు విడుదల అయ్యాయి. రాజధాని రైతులకు వార్షిక కౌలుగా ఈ మొత్తాన్ని చెల్లించేందుకు విడుదల చేశారు. ప్రభుత్వం దీనికి సంబంధించి పాలనానుమతి మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలకు జమ చేయాల్సిందిగా అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండీ... MP RRR: ఏపీ అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది: ఎంపీ రఘురామ