ETV Bharat / city

రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుకు ఉత్తర్వులు - BC corporations news

ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీలకు పథకాలు వేగంగా అందేలా కార్పొరేషన్లు సహకరిస్తాయన్న ప్రభుత్వం తెలిపింది.

The government has issued orders setting up 56 BC corporations in the state.
రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుకు ఉత్తర్వులు
author img

By

Published : Oct 16, 2020, 2:00 PM IST

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి బీసీ కులాల కార్పోరేషన్​లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 56 బీసీ కులాల కార్పోరేషన్​లు ఏర్పాటు చేస్తూ వెనుకబడిన తరగతుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వెనుకబడిన కులాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వేగంగా లబ్దిదారులకు అందేలా ఈ కార్పోరేషన్లు సహకరిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు 139 బీసీ ఉపకులాలకూ ప్రాతినిధ్యం వహించేలా ఈ 56 కార్పోరేషన్లు పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నెల 18 తేదీన బీసీ కార్పోరేషన్ చైర్మన్, డైరెక్టర్లను నియమించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రతీ కార్పోరేషన్​లోనూ 13 మంది డైరెక్టర్లను నియమిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన 56 బీసీ కులాల కార్పోరేషన్ల పరిధిలో మిగతా ఉపకులాలకూ ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపింది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం, బీసీ కులాల కార్పోరేషన్ల ఏర్పాటు చేస్తూ వేర్వేరుగా ప్రభత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

ఇదీ చదవండి: దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్​గా పాల్గొన్న జగన్​, గడ్కరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.