రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.ముకేష్ కుమార్ మీనాను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనా.. గవర్నర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. గవర్నర్ కార్యదర్శిగా ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ.. గిరిజన సంక్షేమశాఖ నుంచి ఆయన్ను తప్పించారు. మరోవైపు ఈ శాఖ బాధ్యతల్ని సంక్షేమశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు అప్పగించారు. తదుపరి ఉత్తర్వుల వెలువరించేంత వరకు గిరిజన సంక్షేమశాఖ బాధ్యతలు ఎం.రవిచంద్ర పర్యవేక్షిస్తారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీచూడండి.భాజపాలోకి తెదేపా కీలక నేత... భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు?