తెలంగాణ మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఆర్టీసీ బస్టాండ్‌లోని పరిసర ప్రదేశాల్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో రోడ్డు ప్రమాదాలకు గురైన వాహనాలు, చోరీ కేసుల్లో పట్టుబడిన వాహనాలను పోలీసులు నిల్వ చేశారు. వీటికి సమీపంలోని చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా లేక... కావాలనే ఎవరైనా నిప్పంటించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: అదుపుతప్పిన వరి నూర్పు యంత్రం... ఇద్దరు మహిళలు మృతి