అప్పు కోసం సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఊరట ఇచ్చింది. మార్కెట్ల నుంచి రూ.2,655 కోట్లు సమీకరించుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అనుమతించింది. మూలధన వ్యయం కోసం లక్ష్యాన్ని చేరుకున్న ఏపీ సహా 11 రాష్ట్రాలకు.. 2021-22 మొదటి త్రైమాసికంలో అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్ధికశాఖ అనుమతించింది. అన్నిరాష్ట్రాలకు కలిపి మార్కెట్ నుంచి అదనంగా రూ.15,721 కోట్లు సమీకరించుకునేందుకు అంగీకరించింది.
కేంద్రం నిర్ధేశించిన పలు లక్ష్యాలు చేరుకున్నందుకు ప్రోత్సాహకంగా అదనపు రుణ సమీకరణకు అవకాశం కల్పించారు. స్థూల రాష్ట్ర ఉత్పత్తి-జీఎస్డీపీలో 0.25 శాతానికి సమానంగా మార్కెట్‌లో రుణాలు తెచ్చుకునే అవకాశం ఇచ్చారు. అదనపు ఆర్థిక వనరులతో రాష్ట్రాలు తమ మూలధన వ్యయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని కేంద్రం అభిప్రాయపడింది.
ఇదీ చదవండి