ETV Bharat / city

అనాథ చిన్నారులకు అండగా కేంద్రం..ఆర్థిక సాయం అందజేత - Center provides assistance to orphaned children

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి.. అనాథలుగా మారిన చిన్నారులకు కేంద్రం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఇప్పటికే ఈ తరహా చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాష్ట్రం అందిస్తున్న సాయానికి ఇది అదనం.

Help for orphaned children
అనాథ చిన్నారులకు సాయం
author img

By

Published : Aug 15, 2021, 10:09 AM IST

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారులకు కేంద్రం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనుంది. పీఎం కేర్స్‌ చిల్డ్రన్స్‌ పథకం కింద ఈ సాయాన్ని ఇస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా చిన్నారుల బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్‌ చేయనుంది. 18 ఏళ్లలోపు వారికి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర మహిళాశిశు సంక్షేమశాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ తరహా చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షల సాయానికి ఇది అదనం.

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల వివరాల నమోదుకు కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రాల జువైనల్‌ జస్టిస్‌ విభాగం అధికారులు ఇలాంటి చిన్నారుల వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేస్తారు. చిన్నారుల పేరుతో బ్యాంకు ఖాతా లేకపోతే ప్రత్యేక ఖాతా తెరవాల్సిన బాధ్యత జువైనల్‌ జస్టిస్‌ అధికారులదే. పోర్టల్‌లో చిన్నారుల వివరాల నమోదు తర్వాత సంబంధిత చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఛైర్మన్‌.. పోర్టల్‌లో తన ఆధార్‌ కార్డు నంబరుతో నమోదై సదరు వివరాలను ధ్రువీకరించి జిల్లా కలెక్టర్‌కు పంపించాలి. కలెక్టర్‌ తన ఆధార్‌కార్డు నంబరు మీద పోర్టల్‌లో నమోదై చిన్నారుల వివరాలను కేంద్రానికి నివేదిస్తారు. ఆ తర్వాత సాయం విడుదలవుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ చిన్నారులు 223 మంది ఉన్నట్లు జువైనల్‌ జస్టిస్‌ అధికారులు గుర్తించారు. వీరిలో 205 మంది వివరాలను పోర్టల్‌లో నమోదు చేశారు. అన్ని ఆధారాలతో బాధితుల వివరాలు ఎవరైనా పోర్టల్‌లో నమోదు చేసే అవకాశం ఉంది.

నెలకు రూ.500 చొప్పున సాయం

కరోనాతో తల్లి లేదా తండ్రిని కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.500 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ మొత్తాన్ని ఇస్తారు. ఈ సాయాన్ని అందించేందుకు నిర్ణీత గడువంటూ ఏదీ లేదు. కొంత కాలంపాటు ఇస్తారు. ఈ తరహా చిన్నారులు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5,398 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 3,582 మంది వివరాల పరిశీలన పూర్తయింది.

ఇదీ చదవండీ.. Railway Thefts: ఒకేలాంటి దొంగతనాలు.. విభిన్న తీర్పులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.