ETV Bharat / city

రాజధాని ప్రాంత రహదారులు.. ఎలా ఉన్నాయంటే..! - roads news

No Roads Maintenance at Amaravati: అస్తవ్యస్త రహదారులు.. అడుగడుగునా పెద్ద పెద్ద గోతులు.. రోడ్లకు అటు ఇటు అంతెత్తున పెరిగిన చెట్లు.. చూసేందుకు కనీస వసతులకు నోచుకుని మారుమూల పల్లెను తలపిస్తోన్న ఈ ప్రదేశం.. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న రాజధాని అమరావతి ప్రాంతం. వేల మంది విద్యార్థుల చదువుకుంటున్న, ప్రముఖ విద్యాలయాలు, హైకోర్టు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాల సమాహారానికి నెలవు. అలాంటి ఈ ప్రాంతానికి వెళ్లాలంటే మాత్రం బురద దారుల్లో, భారీ గోతుల రహదారుల్లో.. ముళ్ల కంపల మార్గాల్లో ప్రయాణించాల్సిందే.

మారుమూల పల్లెను తలపిస్తున్న అమరావతి రోడ్లు

author img

By

Published : Jul 18, 2022, 5:03 PM IST

రాజధాని ప్రాంత రహదారులు.. ఎలా ఉన్నాయంటే..!

Roads are bad at Amaravati: రాజధాని అమరావతిలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకింగ్ ఉన్న విట్, ఎస్​ఆర్​ఎం, అమృత విశ్వవిద్యాలయాలు పని చేస్తున్నాయి. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం, సచివాలయం లాంటి కార్యాలయాలు సేవలు అందిస్తున్నాయి. వీటిని చేరుకునేందుకు సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం చేపట్టినా పూర్తి కాకపోవడం, ప్రభుత్వం మారడంతో రహదారుల నిర్మాణం, నిర్వహణ నిలిచిపోవడంతో రోడ్లు అధ్వానంగా మారాయి. గత ప్రభుత్వం ఆహ్వానం మేరకు కోట్ల రూపాయలు వెచ్చించి క్యాంపస్‌లు ఏర్పాటు చేసిన ప్రముఖ యూనివర్సిటీలకు.. ప్రస్తుతం కనీస రహదారి సౌకర్యం కూడా లేకుండా పోయింది.

గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో భూ కేటాయింపులు జరిగిన కొన్ని సంస్థలు అధికార మార్పిడి తర్వాత పరిణామాలతో వెనక్కి వెళ్లిపోయాయి. రాజధాని పనులు నిలిపివేతతో శంకుస్థాపన చేసిన ఎక్స్​ఎల్​ఆర్​ఐ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి. ఎస్​ఆర్​ఎం, విట్‌కు అప్పటి ప్రభుత్వం 200 ఎకరాల చొప్పున, అమృత యూనివర్సిటీకి 150 ఎకరాలు భూమి కేటాయించింది. భవిష్యత్తులో వైద్య కళాశాలలు, ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేయాలన్నది ఆ విద్యాసంస్థల ప్రణాళికలో భాగం. కానీ వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయడంతో.. ఆ ప్రతిపాదనల్ని ఈ సంస్థలు ప్రస్తుతానికి పక్కన పెట్టేశాయి. ప్రస్తుతం విట్‌లో 9 వేల మంది, ఎస్​ఆర్​ఎంలో 5 వేల 800 మంది విద్యార్థులున్నారు. అమరావతి అభివృద్ధిపై ఆసక్తిలేని ప్రభుత్వం.. అక్కడున్న విద్యా సంస్థల్నీ నిర్లక్ష్యం చేస్తోందని, రహదారులు వంటి కనీస మౌలిక వసతుల్నీ కల్పించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ కి కూడా సరియైన రహదారి సౌకర్యం లేదు.

అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో తూర్పు నుంచి పడమరకు వేసే ప్రధాన రహదారులకు ఇ1, ఇ2 అని.. ఉత్తరం నుంచి దక్షిణానికి వేసే రహదారులకు ఎన్​1, ఎన్​2.. అని నెంబర్లు కేటాయించారు. వాటిలో ఆరు వరుసల ఇ-8 రహదారి పక్కనే విట్‌ ఉంది. ఈ దారిని సగంలో వదిలేయడంతో.. అప్పటివరకు వేసిన రోడ్డు కూడా శిథిలమవుతోంది. మధ్యలో ఉన్న రెండు వరుసల రహదారిని విట్‌ యూనివర్సిటీ సొంత ఖర్చులతో బాగు చేసుకుంది. ఇక ఎన్​-9 రహదారి ఎస్​ఆర్​ఎం, విట్, ఎన్​ఐడిల సమీపం నుంచి సచివాలయం మీదుగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకి కలుస్తుంది. ఎన్​-9తో పాటు, ఆయా యూనివర్సిటీల పక్క నుంచి తూర్పు-పడమర దిశలో వేసిన రహదారుల్ని మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేస్తే వాటికి అనుసంధానం ఏర్పడుతుంది. అయితే సీడ్ యాక్సెస్ రహదారితో పాటు అనుబంధ రహదారులు కూడా అభివృద్ధి చేస్తామని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.

విట్, ఎస్​ఆర్​ఎం వసతి గృహాల్లో దాదాపు ఆరేడు వేల మంది విద్యార్థులుంటున్నారు. ఏ అర్ధరాత్రో, అపరాత్రో అనారోగ్య సమస్యలు తలెత్తే.. విజయవాడ లేదా గుంటూరుకు తీసుకెళ్లాలంటే ఈ రహదారులపై ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకోవాల్సిందే . దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు కనీస మౌలికవసతులు లేక అవస్థలు పడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.