ETV Bharat / city

'టీకాల కొనుగోలు రాష్ట్రాల చేతుల్లో ఉండవు' - Vaccine tenders news

వ్యాక్సిన్‌ కొనుగోలుపై గ్లోబల్‌ టెండర్లు పిలవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని...అయితే దీనికి కేంద్రం అనుమతి తప్పనిసరని ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. స్టాక్ ఉన్నంత వరకూ 45 ఏళ్లకు పైబడిని వారికి సెకండ్ డోస్ ఇవ్వాలని, వారికివ్వగా మిగిలితే...ఫస్ట్ డోస్ కింద టీకా వేయాలని సీఎం ఆదేశించారన్నారు

అనిల్ కుమార్ సింఘాల్
అనిల్ కుమార్ సింఘాల్
author img

By

Published : May 11, 2021, 7:18 AM IST

కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే విదేశాల నుంచి టీకాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర జనాభాకు అవసరమైన 4 కోట్ల వ్యాక్సిన్లను కొనుగోలుకు అవసరమైన రూ.1600 కోట్లను ఇప్పుడే చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ కేంద్ర నిబంధనలు ఆటంకంగా ఉన్నాయని... వివిధ కంపెనీలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మిగిలిన 50 శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వ సూచించిన కోటా ప్రకారమే ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇష్టమొచ్చినట్లు కొనుగోలు చేయడానికి కుదరదన్నారు.

టీకాల కొనుగోలుపై గ్లోబల్‌ టెండర్లకు..
ఇదే విషయం సుప్రీం కోర్టులో వేసిన అఫిడివిట్ లో కేంద్రం చెప్పిందన్నారు. మే నెల వరకూ 17 లక్షల కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఇందుకు అవసరమైన నిధులు చెల్లించామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలని నిర్ణయించిందని వెల్లడించారు. స్పుత్నిక్ వి సహా విదేశాల నుంచి వచ్చే ఏ కొవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని, ఇందుకోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విదేశాల నుంచి టీకాలు కొనుగోలు చేయాలన్నా.... కేంద్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి అని ఆయన తెలిపారు. విదేశీ టీకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

తెలంగాణతో మాట్లాడాం..

వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచడం ద్వారా సకాలంలో దేశ ప్రజలందరికీ టీకాలు వేయగలమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన అన్ని అనుమతులను తక్షణమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. స్టాక్ ఉన్నంత వరకూ 45 ఏళ్లకు పైబడిని వారికి సెకండ్ డోస్ ఇవ్వాలని, వారికివ్వగా మిగిలితే...ఫస్ట్ డోస్ కింద టీకా వేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య అంబులెన్స్‌లను ఎటువంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించేలా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మాట్లాడారని అన్నారు..

ఇదీ చదవండి

ఆక్సిజన్ ట్యాంకర్ 5 నిమిషాలు ఆలస్యం.. 11 మంది కొవిడ్ రోగులు మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.