వెనకబడిన కులాలకు రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ వర్గాలకు విద్యాసంస్థలు, ఉద్యోగ నియామకాలు, వయసు సడలింపు విషయంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు మరో పదేళ్లు వర్తిస్తాయని పేర్కొంది. బీసీల్లోని ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీలకు ప్రస్తుతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.
వీటి గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. సామాజికంగా ఇతర వర్గాలతో సమానంగా బీసీలు అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లను మరో పదేళ్లు కొనసాగించాలని రాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ మేరకు రిజర్వేషన్లను 2031 మే వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: