ETV Bharat / city

డీఏ బకాయిలు హుష్‌కాకి.. జీపీఎఫ్‌కు జమచేసి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం - ap latest news

DA Arrears: ఉద్యోగులను ప్రభుత్వం మరోమారు నమ్మించి, మోసం చేసింది. డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేసినట్లే చేసి, వెనక్కి తీసుకుంది. వ్యక్తిగత జీపీఎఫ్‌ ఖాతాల నుంచి తమ అనుమతి లేకుండా తీసుకోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వెనక్కి తీసుకున్న డీఏ బకాయిలు సుమారు రూ.800 కోట్ల వరకు ఉంటాయి. రాష్ట్రంలో 90వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి ఈ సొమ్ము మాయమైంది.

Da Arrears
Da Arrears
author img

By

Published : Jun 29, 2022, 4:27 AM IST

Updated : Jun 29, 2022, 6:54 AM IST

ఉద్యోగులను ప్రభుత్వం మరోమారు నమ్మించి, మోసం చేసింది. డీఏ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేసినట్లే చేసి, వెనక్కి తీసుకుంది. వ్యక్తిగత జీపీఎఫ్‌ ఖాతాల నుంచి తమ అనుమతి లేకుండా తీసుకోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఖాతాలో ఎవరైనా జమ చేయొచ్చు. విత్‌డ్రా చేసే అధికారం మాత్రం ఉద్యోగికే ఉంటుంది. ఉద్యోగుల అనుమతి లేకుండా ఇప్పుడు ప్రభుత్వం నిధులను తీసేసుకుంది. దీనిపైనా కొందరు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. విత్‌డ్రా చేయడానికి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వనందున ఎలా ఫిర్యాదు చేయాలి? సీఎఫ్‌ఎంఎస్‌పై ఫిర్యాదు చేయాలా? అని సమాలోచనలు చేస్తున్నారు.

డీఏ బకాయిలు హుష్‌కాకి.. జీపీఎఫ్‌కు జమచేసి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకు జీపీఎఫ్‌ ఖాతాలకు సంబంధించిన వివరాల స్లిప్పులను ఏజీ కార్యాలయం ఆన్‌లైన్‌లో పెట్టింది. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. డీఏ బకాయిలను విడతల వారీగా జమచేసినట్లు స్లిప్పుల్లో ఉండగా.. గత మార్చిలో మొత్తం ఒకేసారి వెనక్కి తీసేసుకున్నట్లు ఉంది. ఉద్యోగుల సర్వీసును అనుసరించి ఒక్కొక్కరి ఖాతాలో సుమారు రూ.60 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు జమ అయినట్లే అయ్యి, వెనక్కి వెళ్లిపోయాయి. గత మార్చిలోనే కొంతమంది ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి నగదు వెనక్కి వెళ్లిపోయినట్లు సెల్‌ఫోన్లకు సమాచారం వచ్చింది. అప్పట్లో దీనిపై ఆందోళనతో ఆర్థికశాఖకు ఫిర్యాదులు చేశారు. కానీ, జీపీఎఫ్‌ ఖాతాకు సంబంధించి ఆర్థిక సంవత్సరం పూర్తి వివరాల స్లిప్పులు రాకపోవడంతో కొందరు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు స్లిప్పులు చూసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు.

అందరికీ మొండిచెయ్యే..: ప్రభుత్వం వెనక్కి తీసుకున్న డీఏ బకాయిలు సుమారు రూ.800 కోట్ల వరకు ఉంటాయి. రాష్ట్రంలో 90వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి ఈ సొమ్ము మాయమైంది. 2018 జులై నుంచి 2020 డిసెంబరు వరకు, 2019 జనవరి నుంచి 2021 జూన్‌ వరకూ ఉన్న డీఏ బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 జనవరి వరకు అయిదు విడతలుగా జీపీఎఫ్‌ ఖాతాలకు జమచేసింది. మార్చిలో ఒకేసారి ఆ మొత్తాన్ని వెనక్కి లాగేసింది. ఇది ఉద్యోగుల వాట్సప్‌ గ్రూపుల్లో సోమవారం హల్‌చల్‌ చేసింది. ప్రభుత్వ చర్యలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. డీఏ బకాయిల్లో సీపీఎస్‌ ఉద్యోగులకు 90% నగదు, 10% సీపీఎస్‌ ఖాతాలకు జమచేయాల్సి ఉండగా.. దీన్ని పట్టించుకోవడం లేదు. కొంతకాలంగా సీపీఎస్‌ ఉద్యోగులు ఎన్ని వినతులు ఇచ్చినా ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. పదవీవిరమణ చేసిన వారికి నగదు రూపంలో ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. అలా ఇవ్వకపోగా.. ఇప్పుడు జీపీఎఫ్‌ ఖాతాల్లో జమచేసిన మొత్తాన్నీ ప్రభుత్వం తీసేసుకుంది. జీపీఎఫ్‌ ఖాతాల్లో ఉంటే దానికి వడ్డీ వస్తుంది. తమ డబ్బులు ఖాతాల్లో ఉంటే ఉద్యోగులకు ధీమా ఉంటుంది. ఏమైనా అవసరం ఏర్పడితే జీపీఎఫ్‌ ఖాతాల నుంచి ఉద్యోగులు కొంతమొత్తం విత్‌డ్రా చేసుకుంటారు. పెళ్లిళ్లు, అనారోగ్య పరిస్థితుల్లాంటి అత్యవసర సమయాల్లో జీపీఎఫ్‌ నుంచి కొంత మొత్తం తీసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో ఉద్యోగులు నష్టపోతారు.

ఖాతాల్లో డబ్బు మాయం చేస్తారా?: ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్‌ ఖాతాల నుంచి డబ్బులు ఎలా తీసుకుంటారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, ఆస్కార్‌రావు ప్రశ్నించారు. ‘అకౌంట్స్‌ ఆడిటర్‌ జనరల్‌ నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల 2021-22 ఆర్థిక సంవత్సరం జీపీఎఫ్‌ ఖాతా స్టేట్‌మెంట్‌ను చూస్తే మార్చిలో ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు ఉపసంహరించినట్లు కనిపిస్తోంది. ఉద్యోగుల అనుమతి లేకుండా నగదు ఉపసంహరణ తీవ్రమైన క్రిమినల్‌ చర్యగా భావిస్తున్నాం. ఈ చర్యకు పాల్పడిన ఆర్థికశాఖ, సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులపై వెంటనే సీబీసీఐడీ విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలి. దీనిపై ఆర్థికశాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సచివాలయానికి వెళ్తే ఎవ్వరూ అందుబాటులో లేరు’ అని వెల్లడించారు.

విశాఖ కేజీహెచ్‌లో ఇలా..: కేజీహెచ్‌లో ఓమహిళా ఉద్యోగి జీపీఎఫ్‌ ఖాతా నుంచి రూ.85వేలు ఉపసంహరించారు. మరో ఉద్యోగి ఖాతా నుంచి రూ.1.07లక్షలు, ఇంకో ఉద్యోగి ఖాతా నుంచి రూ.95వేల మేర ఉపసంహరించినట్లు జీపీఎఫ్‌ స్లిప్పుల్లో ఉంది. కొద్ది నెలల కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఉద్యోగసంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో యథాతథంగా ఆయా మొత్తాలను వెనక్కి మళ్లించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురైందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 29, 2022, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.