మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు 613వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, ఉద్ధండరాయునిపాలెం, పెదపరిమి, దొండపాడు, నెక్కల్లులో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు.
జోరు వానలోనూ రైతులు అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ఉద్ధండరాయనిపాలెం, అనంతవరంలో.. రైతులు వానలో తడుస్తూనే నిరసన తెలిపారు. వార్షిక కౌలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కౌలు ఇస్తున్నట్లు జీవో, నిధులు మంజూరు చేసినా.. ఇంకా సగం మంది ఖాతాలో జమ కాలేదని రైతులు చెప్పారు. అమరావతిని నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్తాం: అమరావతి ఐకాస