అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే ప్రక్రియ ప్రారంభించింది తామేనని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నిందితులపై కేసులు పెట్టి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున వంద కుటుంబాలకు సాయం చేశామని వెల్లడించారు. తొలివిడత పంపిణీకి రూ.336 కోట్లు సిద్ధం చేశామని... ఆ మొత్తాన్ని వైకాపా ప్రభుత్వం రూ.264 కోట్లకు తగ్గించిందని వివరించారు. బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు పెట్టి ఎందుకు విడుదల చేయలేదని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తెదేపా దోచేసిందన్న ఆరోపణలు ఏమయ్యాయని నిలదీశారు. అసత్య ప్రచారం చేసిన వైకాపా నేతలు బాధితులకు క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి