ETV Bharat / city

రక్తం కొరత.. తలసేమియా బాధితులకు తప్పని అవస్థ - రక్త నిల్వలు లేక తలసేమియా రోగులు ఇబ్బందులు

అన్ని రంగాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కరోనా మహమ్మారి తలసేమియా రోగుల పాలిట శాపంగా పరిణమించింది. ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న రోగులకు పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించాలి. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో తమకెక్కడ వైరస్‌ సోకుతుందనే భయంతో రక్తదాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావట్లేదు. ఫలితంగా తలసేమియాతో బాధపడుతున్న రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

రక్తం కొరత.. తలసేమియా రోగులకు అవస్థ
రక్తం కొరత.. తలసేమియా రోగులకు అవస్థ
author img

By

Published : Oct 3, 2020, 6:01 AM IST

తలసేమియా ఇది ఓ అరుదైన వ్యాధి. అరుదుగా సంక్రమించే ఈ వ్యాధితో బాధపడే రోగులకు 15 రోజులకోసారి రక్తం ఎక్కించాలి. అప్పుడే వారు కొన్నాళ్లపాటైనా జీవించగలరు. మాములు రోజుల్లో వాలంటీర్ల ద్వారా రక్తాన్ని సేకరించి రెడ్‌క్రాస్‌ మరికొన్ని ఇతర సంస్థలు ఇలాంటి రోగులకు అందించేవి. అయితే కరోనాతో పరిస్థితి మారిపోయింది. వైరస్‌ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో రక్తదానానికి ప్రజలు జంకుతున్నారు. గతంలో తప్పనిసరిగా ఇచ్చే వారు సైతం వైరస్‌ భయంతో ప్రస్తుతానికి తామివ్వలేమని చెబుతున్నారు. ఫలితంగా తలసేమియాతో పాటు మరికొన్ని అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే ప్రస్తుత సమయంలోనూ రక్తదానం చేసేందుకు కొద్ది మంది యువకులు ముందుకు వస్తున్నారు. తమలాగే అందరూ ముందుకు రావాలని కోరుతున్నారు.

ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకుని, రక్తదానాన్ని ప్రోత్సహించాలని వాలంటీర్లతో పాటు ఆరోగ్యవంతమైన యువకులూ ముందుకు రావాలని రక్తనిధి నిర్వాహకులు కోరుతున్నారు. అప్పుడే తలసేమియా రోగులను కాపాడుకోవచ్చని పిలుపునిస్తున్నారు.

ఇదీ చదవండి : 'డప్పులు, చప్పట్లు కొట్టే అర్హత వైకాపా ప్రభుత్వానికి లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.