కరోనా రోజురోజూకు విజృంభిస్తూనే ఉంది. సామాన్యులనే కాకుండా సినిమా తారాలు, వైద్యులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి జిల్లా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అనంతరం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. బుధవారం జరిగిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేగాతో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ కవిత, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే: ఎన్జీటీ