TRS MLCs Criminal Record : తెలంగాణ శాసనమండలి సభ్యుల్లో (ఎమ్మెల్సీ) 10 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అందులో ఆరుగురిపై తీవ్రమైన అభియోగాలున్నాయని, ఆ ఆరుగురు తెరాసకు చెందిన వారేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. సభ్యుల్లో ఇద్దరు డాక్టరేట్లు ఉన్నారని వెల్లడించింది. మండలిలోని 40 మంది ఎమ్మెల్సీల్లో 33 మంది నామినేషన్ల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వారిపై ఉన్న కేసులు, ఆస్తులు, విద్యార్హత తదితర వివరాలతో కూడిన నివేదికను ఏడీఆర్ తాజాగా విడుదల చేసింది. కురుమయ్యగారి నవీన్ (తెరాస) అఫిడవిడ్ అందుబాటులో లేకపోవడం, ఆరుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు అఫిడవిట్లు సమర్పించాల్సిన అవసరం లేకపోవడంతో వారి వివరాలను నివేదికలో పొందుపర్చలేదు.
Crime History of TRS MLCs : అయిదేళ్లకు పైబడిన జైలు శిక్ష పడే కేసులు, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేవి, ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘనకు సంబంధించిన కేసులను తీవ్రమైనవిగా పరిగణిస్తారు. పాడి కౌశిక్‌రెడ్డి, మహమూద్‌అలీ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండా ప్రకాశ్, కడియం శ్రీహరి, మంకెన కోటిరెడ్డిపై ఇటువంటి కేసులున్నాయి. సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల కవిత, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిపై సాధారణ కేసులున్నాయి.
33 మంది ఎమ్మెల్సీల్లో ఇద్దరు డాక్టరేట్లు ఉన్నారు. 8 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్లు, 9 మంది గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్, 10 మంది గ్రాడ్యుయేట్లు, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు ఇద్దరు, పది ఉత్తీర్ణులు ఒకరు, 5వ తరగతి ఉత్తీర్ణులు ఒకరు ఉన్నారు.
మొత్తం ఎమ్మెల్సీల్లో ముగ్గురు (కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, సురభివాణీదేవి) మహిళలు.
ఎక్కువ ఆస్తులున్న ఎమ్మెల్సీలు (రూ.కోట్లు)
యెగ్గె మల్లేశం (తెరాస) 126.83
పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (తెరాస) 74.79
కసిరెడ్డి నారాయణరెడ్డి (తెరాస) 50.58
కల్వకుంట్ల కవిత (తెరాస) 39.79
అతి తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్సీలు (రూ.లక్షలు)
మీర్జా రియాజుల్ హసన్ (ఎంఐఎం) 61.24
ఉల్లోల్ల గంగాధర్‌గౌడ్ (తెరాస) 70.40
వంటేరి యాదవరెడ్డి 74.03
కాటేపల్లి జనార్దన్‌రెడ్డి (స్వతంత్ర) 96.76
అత్యధిక అప్పులున్న ఎమ్మెల్సీలు (రూ.కోట్లు)
పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (తెరాస) 36.87
కల్వకుంట్ల కవిత (తెరాస) 21.62
పల్లా రాజేశ్వర్‌రెడ్డి (తెరాస) 4.10
అత్యధిక వయసున్న ఎమ్మెల్సీలు
ఎలిమినేటి కృష్ణారెడ్డి (తెరాస) 80
కె.దామోదర్‌రెడ్డి (తెరాస) 74
కడియం శ్రీహరి (తెరాస) 71
చిన్న వయస్కులు
పాడి కౌశిక్‌రెడ్డి (తెరాస) 37
సుంకరి రాజు (తెరాస) 41
మీర్జా రియాజుల్‌హసన్ (ఎంఐఎం) 42
ఇవీ చదవండి :