రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో గ్రూప్-1 అభ్యర్థుల మూల్యాంకనంపై రేపు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి యువజన, విద్యార్థి సంఘాలు వర్చువల్గా.. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ఏపీపీఎస్సీ అనుసరించిన డిజిటల్ వ్యాల్యుయేషన్ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు నివృత్తి చేయాలని తీర్మానించనున్నారు.
డిజిటల్ వ్యాల్యుయేషన్ సాంకేతికతపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలనే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. అన్నీ విద్యార్థి సంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.
ఇదీ చదవండి: మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ వాసులు.. వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు!