వైకాపా తప్పుడు కేసులు, వేధింపులు, ఇతర దురాగతాలను తట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ‘సీఎం జగన్ అరాచక పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని యువతను ఒక వేదికపైకి తెచ్చి పోరాడతాం. మంత్రుల భూ దందాలు, ఇసుక దోపిడీ, మైనింగ్ మాఫియాలకు వ్యతిరేకంగా తెలుగు యువత పోరాడుతుంది. నిరుద్యోగుల నిరసనలను పట్టించుకోని సీఎంకు యువ సత్తా తెలిసొచ్చేలా చేస్తాం. మహిళలపై దాడుల నియంత్రణకు తెలుగు యువత పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. తెలుగు యువత(telugu yuvata) విభాగానికి సంబంధించి 15 పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించారు.
ఇదీ చదవండి..