ETV Bharat / city

శుభాలు కలిగించే... ఉగాది! - Ugadi festival news

కొత్త సంవత్సరాది అనగానే... లేత మామిడి ఆకుల తోరణాలూ, హాయిగొలిపే కోయిల గానం, జీవితసారాన్ని తెలియజేసే షడ్రుచుల ఉగాది పచ్చడీ, పంచాంగ శ్రవణం వంటివే గుర్తొస్తాయి. అయితే... తెలుగు ఏడాది ప్రారంభం కేవలం వాటితోనే పూర్తవదు. ఈ రోజున చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి. ఇంతకీ అవేంటంటే...

ఉగాది పండుగ
ugadi special
author img

By

Published : Apr 13, 2021, 6:10 AM IST

గాదిని యుగాది అని కూడా పిలుస్తారు. అంటే... యుగ+ఆది అని అర్థం. యుగము అంటే జత అనే అర్థం కూడా వస్తుంది. అలా ఉత్తరాయణం, దక్షిణాయనం జతగా కలిస్తే ఒక సంవత్సరంగా భావిస్తాం. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని అంటారు. ఉ అంటే నక్షత్రమనీ, గ అంటే గమనమనీ... దాన్ని ఈ రోజునుంచే లెక్కిస్తారని కూడా చెబుతారు. సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ రోజు నుంచే సృష్టిని ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే... మొదటి సంవత్సరం, మొదటి రుతువు, మొదటి మాసం, మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాదికి ‘ప్లవ’ నామ సంవత్సరమని పేరు. ప్లవను ప్రతిభ, జ్ఞానానికి సంకేతంగా గుర్తిస్తారు. అన్ని పండగల్లానే ఉగాది నాడు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆ తరువాత ఉగాది పచ్చడి తినడంతోనే పండగ అయిపోదు. ఈ రోజున ప్రత్యేకంగా ఫలానా దేవుడిని పూజించాలని ఏ పురాణాల్లోనూ చెప్పలేదు కాబట్టి ఇష్టదేవతా స్మరణ చేసి.. ఆ తరువాతే షడ్రుచుల ఉగాది పచ్చడిని తీసుకోవాలి. అయితే... సృష్టి ప్రారంభం అయ్యేది కూడా ఈ రోజునే కాబట్టి భూమిని పాలించే ప్రభువును దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.

అంటే.. పరమేశ్వరుడిని మించిన ప్రభువు ఉండడు కాబట్టి శివాలయానికి వెళ్లి జగానికే మాతాపితలైన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకుంటే మంచిదని చెబుతారు. లేదంటే లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నా అంతే పుణ్యం లభిస్తుందనీ అంటారు. ఆ తరువాత గో దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. సాధారణంగా ఉగాది పచ్చడి తయారీలో ఉప్పు, పులుపు, వగరు, చేదు, కారం, తీపి కలిపి ఆరు రుచులుంటాయి. ఈ షడ్రుచులు ఏడాదంతా ఎదురయ్యే సుఖదుఃఖాలకూ కష్టనష్టాలకూ సంకేతంగా భావిస్తారు.

ఆరోగ్యపరంగా చూస్తే... ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజున మాత్రమే కాక శ్రీరామ నవమి వరకూ తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటన్నింటితోపాటూ పంచాంగ శ్రవణాన్ని కూడా ఉగాది పర్వదినంలో ఓ భాగంగా పరిగణిస్తారు. పంచాంగాన్ని వినడం వల్ల ఏడాది కాలంలో గ్రహాల కదలికలూ, శుభాశుభ ఫలితాలూ తెలుస్తాయి. వాటన్నింటినీ తెలుసుకోవడం వల్ల రాబోయే పరిస్థితుల్ని ముందే అర్థంచేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవచ్చనేది పంచాంగ శ్రవణం ప్రధాన ఉద్దేశం.

వసంత నవరాత్రులు

వసంత నవరాత్రుల ప్రారంభం..

నవరాత్రులు అనగానే మనకు దుర్గను పూజించే శరన్నవరాత్రులు లేదా గణపతి నవరాత్రులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈ రెండింటితోపాటూ చైత్రమాసంలోనూ ప్రత్యేకంగా నవరాత్రుల్ని తొమ్మిదిరోజులపాటు నిర్వహిస్తారు. అవే వసంత నవరాత్రులు. ఈ సమయంలో శక్తిని కొలిచినా వీటిని విష్ణువుకు సంబంధించిన నవరాత్రులని పేరు. ఈ కాలంలో దుర్గను ఆరాధించడంతో పాటూ రాముడినీ, హనుమంతుడినీ కూడా ఆరాధిస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

ఈ వసంత నవరాత్రులు ఉగాది నుంచి మొదలై శ్రీరామనవమి వరకూ కొనసాగుతాయి. నవరాత్రి ఆఖరు రోజున రాముడు జన్మించాడనీ దాన్నే శ్రీరామనవమిగా జరుపుకుంటామనీ పురాణాలు చెబుతున్నాయి. ఈ నవరాత్రుల్లో దుర్గను ఎందుకు పూజించాలనే దానికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. సుదర్శనుడు అనే రాజు శక్తి సాయంతో యుద్ధం గెలిచాక తన భార్య, అత్తింటివారితో కలిసి అమ్మవారికి పూజలు చేశాడట. ఆ సమయంలో అమ్మవారు నవరాత్రుల పేరుతో తనకు పూజలు చేయమని కోరిందట.

అలా ప్రారంభమైనవే ఈ నవరాత్రులని అంటారు. రామ లక్ష్మణులు కూడా వసంత నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని పూజించారని చెబుతారు. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం, రామనామ జపాన్ని కూడా నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలా సర్వశుభాలనూ కలిగించే కొత్త ఏడాదిని అమ్మవారి అనుగహ్రంతో ఆనందంగా ప్రారంభించి కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడమే ఈ పండగ ప్రధాన ఉద్దేశం.

ఇదీ చదవండి:

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి... లేదంటే రూ. వెయ్యి ఫైన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.