తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగలా భావించే ‘మహానాడు’ ప్రారంభమైంది. ఎన్టీఆర్ భవన్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. జెండాను ఆవిష్కరించారు. 2 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో రోజుకు పది చొప్పున 20 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభోపన్యాసం ఇవ్వనున్నారు.
దేశంలోనే తొలిసారి...
కరోనా వ్యాప్తి దృష్ట్యా... పార్టీ చరిత్రలో తొలిసారిగా ‘వర్చువల్ మహానాడు’ జరగనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 14 వేల మంది జూమ్ యాప్ ద్వారా భాగస్వాములవుతున్నారు. యూట్యూబ్, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రాజకీయ పార్టీ... ఇన్ని వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని భాగస్వాముల్ని చేస్తూ ఆన్‌లైన్‌లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి.
ఇదీ చదవండి:
అభ్యంతరకర వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం..49 మందికి ధిక్కరణ నోటీసులు