ETV Bharat / city

The Times : బ్రిటీష్ పత్రికలో తెలుగు బుడతడి ఘనత - COP26 కాన్ఫరెన్స్‌

అనీశ్వర్ ఆరేళ్ల చిన్నారి... కానీ అతడి ఆలోచన మాత్రం పెద్దవాళ్లను సైతం ఆలోచింపజేసేది. అతనిలోని ఆ ఆరాటమే..ఇంగ్లాండ్ పత్రిక ది టైమ్స్ లో ప్రచురించేలా చేసింది. ఇంతకీ ఎవరీ పిల్లాడు.. ఏంటతని గొప్పతనం అంటారా...? అయితే ఇది చదివేయండి.

Aneeswar
బ్రిటీష్ పత్రికలో ప్రచురితమైన తెలుగు బుడతడి ఘనత
author img

By

Published : Sep 23, 2021, 3:59 PM IST

లండన్ కేంద్రంగా వెలువడుతున్న బ్రిటీష్ దినపత్రిక ది టైమ్స్. రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన పత్రిక. ఎంతోమంది ప్రముఖుల గురించి అందులో ప్రచురింతం అయ్యింది. అలాంటి పేరుగాంచిన పత్రికలో మన తెలుగు తేజం మెరిశాడు. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మూలాలు కలిగిన ఆరేళ్ల అనీశ్వర్ సేవలను గుర్తించిన ది టైమ్స్.. సండే టైమ్స్ మ్యాగజైన్​లో కథనం ప్రచురించింది.

2021 ఫ్యూచర్ యంగ్ బ్రిటిష్ రోల్ మోడల్స్‌లో అనీశ్వర్

పర్యావరణం - సుస్థిర జీవనం అంశంలో చేసిన కృషికి గానూ 2021 ఫ్యూచర్ యంగ్ బ్రిటిష్ రోల్ మోడల్స్‌లో అనీశ్వర్ ఎంపికయ్యాడు. సండే టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై అనీశ్వర్ ఫొటోతో పాటుగా అతని గురించి ప్రచురితమైంది.

నేచర్ బాయ్...జంతువుల ప్రాణరక్షకుడు..

చిత్తూరు జిల్లాకు చెందిన అనీశ్వర్ కుటుంబం ఇంగ్లాండ్​లోని వారీంగ్టన్ పట్టణంలో నివసిస్తోంది. పాఠశాలకు వెళ్లే ఆరేళ్ల అనీశ్వర్ కుంచాల తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సామాజిక సంస్థను ప్రారంభించాడు. పాఠశాల కాలుష్యం, అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, ప్రకృతి సంరక్షణ వంటి పలు అంశాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను పోస్టు చేసి వందలాది మందికి అవగాహన కల్పిస్తున్నాడు.

వన్యప్రాణులను సంరక్షించే టీవీ హీరోలు స్టీవ్ బ్యాక్‌షాల్, డేవిడ్ అటెన్‌బరో లాగానే తానూ అడవి జంతువులను రక్షించాలని భావించాడు. కొత్త తరం జంతు ప్రేమికులకు స్ఫూర్తినిచ్చేలా అడుగులు వేస్తున్నాడు. అనీశ్వర్ ఆలోచనలు తెలియాలంటే మీరు అతని ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లలో పోస్టు చేస్తున్న అతని డాక్యుమెంట్లు చూడాల్సిందే...

Aneeswar
అనీశ్వర్

అనీశ్వర్ తన వన్యప్రాణి వీడియోలను 2020లో లాక్డౌన్ సమయంలో తల్లిదండ్రుల మద్దతుతో రూపొందించడం మొదలుపెట్టాడు. తోటి పిల్లల్లో ప్రకృతిపై మరింత అవగాహన పెంపొందించడం, జంతువులకు సాయం అందించడానికి ఈ వీడియోలు అతనికి ఒక మార్గంగా ఉపయోగపడ్డాయి. అనీశ్వర్ డాక్యుమెంటరీలను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు వేలాది సార్లు చూశారు. తన వీడియోల వీక్షణల ద్వారా డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. అలా వచ్చిన మొత్తాన్ని అడవుల సంరక్షణ, అడవి జంతువుల రక్షణ కోసం ఖర్చు చేస్తున్నాడు. అతను ఇప్పుడు జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థల కోసం, నిధుల సేకరణ కోసం తన స్వంత కార్డులు, ఆర్ట్ ప్రింట్‌లను కూడా తయారు చేస్తున్నాడు.

అనీశ్వర్ యూట్యూబ్ వీడియోలను చూసిన ఎవరికైనా..జంతువులు, ప్రపంచం పట్ల అతనికున్న అభిరుచి ఆకర్షిస్తుంది. ఇంత చిన్న వయస్సులో అతనికి ప్రకృతిపై ఇంత జ్ఞానం, ఆసక్తి ఉందా...అని ఆశ్చర్యపోతారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం, మద్దతుతోనే అనీశ్వర్ తాను ఎంచుకున్న స్వచ్ఛంద సంస్థల కోసం వేలాది మందిని సమీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వీడియోలు, డాక్యుమెంటరీలతో అనీశ్వర్ పాపులారిటీ అతను చదువుతున్న పాఠశాలలో అతన్ని స్టార్ గా చేసింది. ఉపాధ్యాయులు, సహచరుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Aneeswar
అనీశ్వర్

ఇదే నా లక్ష్యం...

"నాకు జంతువులంటే ప్రేమ ఎక్కువ. వాటిని రక్షించడానికి నేను ఏమి చేయాలో నా మెదడుకు తెలుసు. జంతువులు లేకుండా పర్యావరణ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుందని ప్రజలకు తెలియజేయడం నా పెద్ద లక్ష్యం. జంతువులు లేకుండా ఈ గ్రహం మీద మనుషులు లేరు. ఆర్కిటిక్ నుంచి దక్షిణ ధ్రువం వరకు అన్ని జంతువులను రక్షించడమే నా లక్ష్యం..'' అంటున్నాడీ బుడతడు.

అనీశ్వర్ ఆలోచనలు, ఆచరణలకు గుర్తింపుగా యూకే ప్రధానమంత్రి చేతుల మీదుగా పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు, యంగ్ కన్జర్వేషనిస్ట్ లీడర్ (యువ పరిరక్షణవాద వాతావరణ నాయకుడు) అవార్డును అందుకున్నాడు.

పురస్కారంపై అనీశ్వర్ .....

"ప్రధానమంత్రి ద్వారా గుర్తింపు పొందినందుకు, ఈ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డును అందుకున్నందుకు నేను సంతోషంగా, గౌరవంగా ఉన్నాను. నేను జంతు సంక్షేమం కోసం మరిన్ని చేయాలనుకుంటున్నాను, మన భవిష్యత్తు తరాలకు,వన్యప్రాణులకు..అందమైన,స్థిరమైన స్థానాన్ని ఇవ్వడానికి నాకు మీరంతా మద్దతిస్తారని నేను ఆశిస్తున్నాను.

నేను ప్రధానమంత్రిని కలవాలని...COP26 సదస్సు‌కి ఒకరోజు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆశిస్తున్నాను. చిన్న చిన్న వన్యప్రాణి డాక్యుమెంటరీల ద్వారా యువతలో అవగాహన పెంచుతున్నాను. ప్లాస్టిక్ కాలుష్యం, అటవీ సంరక్షణ ఎలా చేయాలో నాకు తెలిసింది చెబుతున్నాను. కాలుష్యం, అడవుల నరికివేత వలన జీవజాతికి కలిగే నష్టాలను తెలియజేస్తున్నాను.

జంతువులను రక్షించండి..ప్రకృతి అందంగా కనిపించేలా చూసుకోండి. ఒక చిన్న అడుగుతో చాలా తేడా చూపించవచ్చు. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ” అని చెబుతున్నాడు అనీశ్వర్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.