ETV Bharat / city

తెలంగాణ: యుద్ధప్రాతిపదికన కరోనా వ్యాప్తి నివారణ చర్యలు - corona in telangana

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్‌.. నివారణ చర్యలను వేగవంతం చేసింది. ఎక్కడికక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. కోర్టులు, విమానాశ్రయాలు, ప్రయాణ ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణతో పాటు.. ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వదంతులు వ్యాప్తించకుండా ఉండేందుకు కఠిన చర్యలకు సిద్ధమైంది.

telangana state government high alert on corona
యుద్ధప్రాతిపదికన కరోనా వ్యాప్తి నివారణ చర్యలు
author img

By

Published : Mar 17, 2020, 6:19 PM IST

యుద్ధప్రాతిపదికన కరోనా వ్యాప్తి నివారణ చర్యలు

కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు హైకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. బెయిల్, రిమాండ్, ఇన్​జెక్షన్ వంటి అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది. నిందితులు, కక్షిదారులు, సాక్షుల హాజరు కోసం ఒత్తిడి చేయవద్దని.. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరితే అంగీకరించాలని స్పష్టం చేసింది. నిందితుల రిమాండ్ ప్రక్రియను వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని పేర్కొంది.

పనిదినాల కుదింపు..

అత్యవసర చికిత్స కోసం కోర్టు సముదాయాల్లో తాత్కాలిక వైద్య సేవలను సమకూర్చాలని జిల్లా న్యాయమూర్తులను ఆదేశించింది. పనిదినాలు, కోర్టులను కుదించాలని నిర్ణయించింది. సోమ, బుధ, శుక్రవారం మాత్రమే పని చేయనుంది. ఒక డివిజన్ బెంచ్, నాలుగు సింగిల్ బెంచ్​లు మాత్రమే కొనసాగుతాయి. ఈనెల 25న (బుధవారం) ఉగాది ఉన్నందున.. గురువారం పనిచేయనుంది.

నెల రోజుల పాటు వాయిదా..

కరోనా వైరస్ ప్రబలకుండా రాష్ట్ర వినియోగదారుల కమిషన్.. ముందస్తు చర్యలు చేపట్టింది. రేపట్నుంచి జరిగే అన్ని కేసులను నెల రోజుల పాటు వాయిదా వేయాలని జిల్లా ఫోరాలను ఆదేశించింది. రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో ఏప్రిల్ 15 వరకు ఉన్న కేసులన్నీ వాయిదా వేసింది. ఈ మధ్య కాలంలో ఎలాంటి వ్యతిరేక తీర్పులు ఇవ్వరాదని స్పష్టం చేసింది. అత్యవసరమని భావించిన కేసులను సోమ, గురువారాల్లో విచారణ చేపట్టనుంది.

మనోధైర్యం కోల్పోవద్దు..

కరోనా వైరస్ పాజిటివ్​గా ఉన్న వ్యక్తులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఈ ముగ్గురితో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అక్కడ కల్పించిన వసతుల పట్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీవ్ర కృషి చేయడం పట్ల సీఎం కేసీఆర్.. ఈటలను అభినందించారు.

థర్మల్ స్క్రీనింగ్ కేంద్రం పరిశీలన..

కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను.. విమానాశ్రయం నుంచి నేరుగా పరిశీలన కేంద్రానికి పంపిస్తున్నారు . ప్రయాణికులను వికారాబాద్‌లోని పరిశీలన కేంద్రంలోని వైద్యుల పర్యవేక్షణలో పరీక్షిస్తారు. శంషాబాద్‌లోని థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిని అడిగి థర్మల్ స్క్రీనింగ్ పని విధానాన్ని తెలుసుకున్నారు.

శానిటైజర్లు ఏర్పాటు..

నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఆహారపదార్థాలను విక్రయించే ప్రదేశాలు, పబ్లిక్ టాయిలెట్ల వద్ద వినియోగదారులకు హ్యాండ్ శానిటైజర్లును ఏర్పాటు చేయాలని యజమాన్యాలను జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలకు ప్రజలు సహకరించాలని కోరింది.

మూతపడిన ఓయూ..

విద్యా సంస్థలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినందున.. హాస్టళ్లు, మెస్‌లు మూసివేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించింది. క్యాంపస్, అనుబంధ హాస్టళ్లను విద్యార్థులు వెంటనే ఖాళీ చేయాలని వర్సిటీ అధికారులు ఆదేశించారు. నేటి నుంచి హాస్టళ్లు, మెస్‌లకు విద్యుత్, మంచినీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

పుకార్లు పుట్టిస్తే కఠిన చర్యలే..

వదంతులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తమైన పోలీస్‌ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పుకార్లను నమ్మవద్దని సూచించింది. ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో వదంతులు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆరోగ్యం పట్ల అనుమానం ఉంటే 104 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను లేదా వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరింది.

ఇవీ చూడండి:

'కరోనా' సెలవుల్లో.. పిల్లలతో ఇలా చేయించండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.