ETV Bharat / city

తెలంగాణలో కొనసాగుతోన్న సచివాలయ భవనాల కూల్చివేత పనులు

తెలంగాణలో సచివాలయం భవనాల కూల్చివేత పనులు మొదలయ్యాయి. హైకోర్టు స్పష్టతనిచ్చిన నేపథ్యంలో అధికారులు పనులు మెుదలుపెట్టారు. తెల్లవారుజాము నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య పనులు చకాచకా సాగుతున్నాయి.

తెలంగాణలో కొనసాగుతోన్న సచివాలయ భవనాల కూల్చివేత పనులు
తెలంగాణలో కొనసాగుతోన్న సచివాలయ భవనాల కూల్చివేత పనులు
author img

By

Published : Jul 7, 2020, 9:34 AM IST

Updated : Jul 7, 2020, 10:30 AM IST

కొనసాగుతున్న సచివాలయ కూల్చివేత పనులు

తెలంగాణలో సచివాలయం భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. హైకోర్టు స్పష్టతనిచ్చిన నేపథ్యంలో అధికారులు తెల్లవారుజామునే పనులు మొదలుపెట్టారు. భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య సచివాలయం భవనాల కూల్చివేత పనులు నడుస్తున్నాయి. అటు వైపు వెళ్లే మార్గాలన్నీ పోలీసులు మూసివేశారు. వాహనాలతో సహా ఎవరినీ అధికారులు అనుమతించట్లేదు. కూల్చివేత పనులను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సీ బ్లాక్​ భవనాలు కూల్చివేస్తున్నారు.

రహదారుల మూసివేత

తెలంగాణలో సచివాలయం భవనాల కూల్చివేత పనులు ప్రారంభం

సచివాలయ కూల్చివేత దృష్ట్యా పలు మార్గాల్లో రహదారులు మూసివేశారు. ట్యాంక్‌బండ్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌, నెక్లెస్‌రోడ్‌ రహదారిలోనూ వాహనాలకు అనుమతివ్వట్లేదు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పోలీసులు పంపిస్తున్నారు. ఆయా మార్గాల్లో ప్రయాణానికి అనుమతి ఇవ్వకపోవడం వల్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగుతున్నారు.

వాహనాలు దారి మళ్లింపు

ఖైరతాబాద్, రవీంద్రభారతి, హిమాయత్​నగర్ కూడళ్ల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సచివాలయం వైపుగా వెళ్లే దారులను అర కిలోమీటర్ ముందే మూసేసిన పోలీసులు.. అటుగా వాహనాలు వెళ్లనీయకుండా దారి మళ్లిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుచేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్​పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:

ఇవాళ కడప జిల్లాకు ముఖ్యమంత్రి జగన్

Last Updated : Jul 7, 2020, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.