లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోవడం వల్ల... పట్టభద్రులు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు ఇంకా తెరచుకోకపోవడంతో ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఆర్థిక కష్టాలు ఎదురవుతుండటంతో ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు.
జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, పట్టభద్రులు పలుగు, పార పట్టుకుని పనులకు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఉపాధి హామీ కొంత ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుండగా... పట్టణాల్లో ఉండేవారికి ఆ ప్రత్యామ్నాయమూ లేదు.
ఇదీ చూడండీ: రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు: సుజనా చౌదరి