ETV Bharat / city

Minister srinivas Goud:'మీ వాటా ఏంటో తేల్చుకుని.. నీళ్లు తీసుకెళ్లండి' - minister srinivas goud reaction on ap cm jagan comments

ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం చేశారని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister srinivas Goud) అన్నారు. ఇంతకుముందు సీఎంలుగా పనిచేసిన వారంతా తమ ప్రాంతాలనే అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణ పేరు పలికేందుకు కూడా ఒప్పుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు అక్కడి అధికారి తనను అవమానపరిచే విధంగా మాట్లాడారని తెలిపారు.

మీ వాటా ఏంటో తేల్చుకుని.. నీళ్లు తీసుకెళ్లండి

author img

By

Published : Jul 1, 2021, 6:49 PM IST

మీ వాటా ఏంటో తేల్చుకుని.. నీళ్లు తీసుకెళ్లండి

తెలంగాణ-ఏపీ జలవివాదంపై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister srinivas Goud) స్పందించారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నానని.. వారిని ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడట్లేదన్న ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. జగన్ అలా మాట్లాడటం బాధాకరమన్నారు. గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలిచ్చినా ఖాతరు చేయకుండా.. కేంద్ర మంత్రికి ఇచ్చిన మాటను పెడచెవిన పెట్టి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టారని ఆరోపించారు. మిగులు జలాల పేరుతో పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

తెలంగాణ వచ్చాక ఏపీ వాసులను ఇబ్బంది పెట్టలేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏపీకి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల అందరి కోసం కేసీఆర్ ఆలోచించారని తెలిపారు.

కరోనా కాలంలో ఆక్సిజన్​ కోసం విశాఖకు వెళ్తే స్టీల్ ప్లాంట్ బంద్ చేశారు. అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను అవమానపరిచారు. తెలంగాణ బస్సులను డిపోల్లోకి రానీయకపోతే.. రోడ్లమీద పెట్టుకుని మా డ్రైవర్లు బస్సులోనే నిద్రపోయారు. తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్తే అక్కడి అధికారి నన్ను అవమానపరిచాడు. అయినా మేమం మాట్లాడలేదు. ఇక్కడి ఏపీ ప్రజల కోసం మేం అన్నీ భరించాం. నిజంగా ఏపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రజలపై ప్రేముంటే.. ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపేయండి. మీ వాటా ఏంటో తేల్చుకుని.. అన్ని అనుమతులు తీసుకుని అప్పుడు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టండి. - శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మంత్రి

ఇదీ చదవండి :
జల వివాదం.. ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.