Minister Satyavathi's Father Passes Away :తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్కు పితృవియోగం కలిగింది. మంత్రి సత్యవతి తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఉన్న సత్యవతి రాఠోడ్.. తండ్రి మరణవార్త తెలిసి అక్కణ్నుంచి తిరుగు పయనమయ్యారు. మంత్రి సత్యవతి తండ్రి మృతి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. కేసీఆర్ సత్యవతి రాఠోడ్ను ఫోన్లో పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.