ETV Bharat / city

Gadchiroli Encounter news : గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ మృతుల్లో.. తెలంగాణ వారున్నారా? - Gadchiroli encounter in Maharashtra

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకాలోని గ్యార్​పట్టి అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో(Gadchiroli Encounter) 26 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తెలంగాణకు చెందిన వారున్నారా అనే కోణంలో రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన పడకల్​స్వామి(telangana Maoist) ప్రస్తుతం గడ్చిరోలి అడవుల్లోనే ప్లటూన్ కమాండర్​గా పనిచేస్తున్నట్లు సమాచారం ఉండటంతో ఈ ఎన్​కౌంటర్​(Gadchiroli Encounter)లో అతను కూడా మృతి చెందాడా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

telangana-maoists-died-in-gadchiroli-encounter
గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ మృతుల్లో తెలంగాణ వారున్నారా?
author img

By

Published : Nov 14, 2021, 9:32 AM IST

మహారాష్ట్రలో మావోయిస్టుల(Maharashtra Maoists)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని గ్యార్‌పట్టి అడవుల్లో శనివారం మధ్యాహ్నం ఎదురుకాల్పుల్లో(Gadchiroli Encounter) కనీసం 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డే కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీసులు దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఏడాది చేపట్టిన వాటిలో అతిపెద్ద ఆపరేషన్‌ ఇదేనని భావిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

ఈ ఎన్‌కౌంటర్‌(Gadchiroli Encounter)లో మృతి చెందిన మావోయిస్టుల్లో తెలంగాణ(Telangana Maoists)కు చెందిన వారున్నారా? అనే కోణంలో రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. తెలంగాణ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిని దాటితే గడ్చిరోలి జిల్లాలోని సిరొంచ తాలూకా ప్రారంభమవుతుంది. తెలంగాణకు చెందిన పడకల్‌స్వామి(Telangana Maoist Padakal Swamy) ప్రస్తుతం గడ్చిరోలి అడవుల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాడు. శనివారం ఎన్‌కౌంటర్‌(Gadchiroli Encounter) జరిగిన అడవుల్లోనే ప్లటూన్‌ కమాండర్‌గా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారముంది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన స్వామి దాదాపు రెండు దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటినుంచి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాడు.

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దును(Chhattisgarh border) ఆనుకుని ఉండే గడ్చిరోలి జిల్లా(Gadchiroli district)లో గ్యార్‌పట్టి అడవుల్లో(GyarPatti forest) మావోయిస్టు ఏరివేత చర్యల్ని సి-60 కమాండోలు పెద్దఎత్తున చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి, వారిపై కాల్పులకు దిగారని అధికారులు తెలిపారు. సి-60 దళాలు ఎదురు కాల్పులకు దిగడంతో కనీసం 26 మంది మృతి చెందగా కొందరు మాత్రం అడవిలోకి పారిపోయారని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతం దట్టమైన అడవుల్లో ఉండడంతో అక్కడకు చేరుకోవడమూ క్లిష్టతరంగా మారింది. ఘటన స్థలంలో మావోయిస్టుల మృతదేహాల(Maoists deadbodies)తో పాటు ఆయుధాలను, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందినవారి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎదురుకాల్పుల్లో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నాగ్‌పుర్‌కు హెలికాప్టర్లో తరలించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని మొహల్లా జిల్లాకు ఆనుకుని ఉండే జిల్లా గడ్చిరోలి. దీనిలో ఒకటైన గ్యార్‌పట్టి పోలీసు స్టేషన్‌.. మావోయిస్టుల కార్యకలాపాల పరంగా అత్యంత సున్నితమైనది. ఎత్తైన కొండలు, దట్టమైన కీకారణ్యం నడుమ ఇది ఉండడం దీనికి కారణం. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ మొహల్లాలో, ఇటు గడ్చిరోలిలో మావోల కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుంటాయి. మావోల కదలికలు ఎక్కువగా ఉన్నాయన్న సమాచారంతో శుక్రవారం సాయంత్రం నుంచే భద్రత బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. శనివారం మావోలు, బలగాలు పరస్పరం తారసపడినప్పుడు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ వెంటనే అదనపు బలగాలతో హెలికాప్టర్లను జిల్లా కేంద్రం నుంచి ఘటనాస్థలికి పంపించారు. అప్పటికే సి-60 దళాలు పది అక్కడ ఉన్నాయి.

ఇదీ చదవండి : నెత్తురోడిన గడ్చిరోలి- 26 మంది నక్సల్స్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.