నూతన రెవెన్యూ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లు-2020, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, పురపాలక నియమాల సవరణ బిల్లుకు ఆమోదించింది.
రెవెన్యూ బిల్లు ఆమోదంతో తెలంగాణ సీఎం కేసీఆర్ను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు. శాసనసభలో కేసీఆర్ విజయచిహ్నం ప్రదర్శించారు. శాసనసభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.
ఇదీ చదవండి:కరోనా అనంతరం తలెత్తే సమస్యలపై 'ఫోన్ సర్వే'