ETV Bharat / city

4 వారాల్లో భద్రతా కమిషన్‌ ఏర్పాటు చేయండి: ఏపీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

రాష్ట్ర భద్రతా కమిషన్‌, పోలీసు ఫిర్యాదుల మండలి ఏర్పాటుకు కరోనాను కారణంగా చూపొద్దని, చాలా రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు కరోనా నియంత్రణలో చాలా ముందున్నాయంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Telangana High Court
Telangana High Court
author img

By

Published : Jan 22, 2021, 8:09 AM IST

వచ్చే నాలుగు వారాల్లోగా.. ఏపీ రాష్ట్ర భద్రతా కమిషన్, పోలీసుల ఫిర్యాదు మండలిని ఏర్పాటు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ హై కోర్టు ఆదేశించింది. కరోనా కారణంగా.. వీటిని వాయిదా వేయవద్దని చెప్పింది. మరోవైపు.. భద్రతా కమిషన్‌, పోలీసు ఫిర్యాదుల మండళ్ల ఛైర్మన్‌, సభ్యుల పేర్ల జాబితాను పరిశీలించి ఆమోదం చెబుతామని, అనంతరం నాలుగు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది.

ప్రకాశ్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర భద్రతా కమిషన్‌, పోలీసు ఫిర్యాదుల మండళ్లను ఏర్పాటు చేయాలంటూ 2017లో ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలుకాలేదంటూ అదే ఏడాది ఎన్‌.ఎస్‌.చంద్రశేఖర శ్రీనివాసరావు రాసిన లేఖను హైకోర్టు కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా తీసుకుని పలుమార్లు విచారించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.

అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర భద్రతా కమిషన్‌, పోలీసు ఫిర్యాదుల మండళ్ల ఛైర్మన్‌ పోస్టుల నిమిత్తం సుప్రీం, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లను, పోలీసు ఫిర్యాదుల మండళ్ల జిల్లా ఛైర్మన్‌ పోస్టుల నిమిత్తం జిల్లాల విశ్రాంత జడ్జీల పేర్లను ప్రతిపాదించామన్నారు. వీటికి హైకోర్టు ఆమోదం చెప్పాల్సి ఉందన్నారు. ఏపీ తరఫున ప్రభుత్వ న్యాయవాది పి.గోవిందరెడ్డి వాదనలు వినిపిస్తూ... రాష్ట్ర భద్రతా కమిషన్‌, పోలీసు ఫిర్యాదుల మండళ్ల ఏర్పాటుకు 2020 నవంబరు 2న రెండు జీవోలు జారీ చేశామని, వాటిని కోర్టుకు అందజేశామన్నారు. రాష్ట్ర పాలనపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని, నియామక ప్రక్రియ చేపట్టడానికి 12 వారాల గడువు కావాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ నాలుగు వారాల్లో నియామక ప్రక్రియ చేపట్టి అమలు నివేదికను కోర్టుకు సమర్పించాలని ఏపీని ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.