తెలుగు రాష్ట్రాల హోంశాఖలపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర భద్రతా కమిషన్, ప్రజా ఫిర్యాదుల సంస్థ ఏర్పాటులో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ.. నాలుగు వారాల్లో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. అమలులో విఫలమైతే హోం శాఖ ముఖ్యకార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుందని తెలిపింది.
ఇరు రాష్ట్రాల హోంశాఖ ముఖ్యకార్యదర్శులను విచారణకు పిలవక తప్పదన్న ఉన్నత న్యాయస్థానం.. తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేసింది. భద్రతా కమిషన్, ప్రజా ఫిర్యాదుల సంస్థ ఏర్పాటుకు 2017లోనే న్యాయస్థానం ఆదేశించినా ఆ తీర్పు అమలు కాలేదు. దీంతో సుమోటోగా కోర్టు ధిక్కరణ వ్యాజ్యం నమోదు చేసింది.
ఇదీ చదవండి:
బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతపై హైకోర్టు విచారణ... కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి