ETV Bharat / city

jagan disproportionate assets case: 'జప్తు చేసిన భూములను హెటిరో సంస్థకు అప్పగించండి' - cm jagan)

ముఖ్యమంత్రి జగన్(cm jagan) అక్రమాస్తుల కేసులో జప్తు చేసిన హెటిరో(hetero lands) భూములను ఆ సంస్థకు అప్పగించాలని ఎన్​ఫోర్స్​మెంట్(enforcement directorate) డైరెక్టరేట్​ను తెలంగాణ హైకోర్టు(telangana high court) ఆదేశించింది. గతంలో ఈడీ అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

సీఎం జగన్
సీఎం జగన్
author img

By

Published : Jul 16, 2021, 10:11 PM IST

Updated : Jul 16, 2021, 10:39 PM IST

ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో జప్తు చేసిన హెటిరో భూములను ఆ సంస్థకు అప్పగించాలని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా విశాఖ జిల్లా నక్కపల్లిలో హెటిరో సంస్థకు చెందిన 43 ఎకరాల భూమిని ఈడీ జప్తు చేసింది. హెటిరో పిటిషన్​పై విచారణ జరిపిన దిల్లీలోని ఈడీ అప్పీలేట్ అథారిటీ.. 2018లో తీర్పు వెల్లడించింది. భూమి విలువకు సమానమైన రూ.5.6 కోట్లు డిపాజిట్ స్వీకరించి, భూములు అప్పగించాలని ఈడీ అప్పీలేట్ అథారిటీ ఆదేశించింది.

తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు....

అప్పీలేట్ అథారిటీ ఆదేశాల మేరకు హెటిరో కంపెనీ సొమ్ము డిపాజిట్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ... ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఉత్తర్వుల సవరణ...

సొమ్ము డిపాజిట్ చేసినప్పటికీ.. మధ్యంతర ఉత్తర్వుల వల్ల భూమి దక్కడం లేదని హెటిరో తరఫు న్యాయవాది పేర్కొన్నారు. భూమి, డిపాజిట్ రెండూ తమ వద్ద పెట్టుకోవడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. స్టేటస్ కో ఎత్తివేసిన హైకోర్టు.. హెటిరోకు భూమి అప్పగించాలని ఉత్తర్వులు సవరించింది. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టీవీ, కార్మెల్ ఏషియా, జననీ ఇన్ ఫ్రా, తదితర సంస్థల ఆస్తుల జప్తునకు సంబంధించిన కేసుల విచారణను సెప్టెంబరు 30కి వాయిదా వేసింది.

ఇదీచదవండి.

SUPARI KILLING: హంతకులను పట్టించిన మొబైల్​ సిగ్నల్స్​

Last Updated : Jul 16, 2021, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.