ETV Bharat / city

ఈ అర్ధరాత్రి నుంచి ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి

నేటి అర్ధరాత్రి నుంచి ఔటర్​ రింగ్​ రోడ్డు(ఓఆర్​ఆర్​)పై వాహనాలకు అనుమతిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఓఆర్​ఆర్​పై వాహనాల రాకపోకలకు అనుమతించాలని హెచ్​ఎండీఏ, హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ నిర్ణయం తీసుకున్నాయి.

అనుమతి
అనుమతి
author img

By

Published : May 20, 2020, 6:20 PM IST

ఔటర్​రింగ్​ రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి నుంచి వాహనాలను అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగాంగా అర్ధరాత్రి నుంచి ఓఆర్​ఆర్​పై వాహనాల రాకపోకలకు అనుమతించాలని హెచ్​ఎండీఏ, హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ నిర్ణయం తీసుకున్నాయి.

ప్రజారోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్​ఆర్​పై టోల్​గేట్​ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించింది. డిజిటల్​ పేమెంట్​ పద్ధతిలో ఫాస్టాగ్​ చెల్లింపులకు అవకాశం ఉండనుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్​ఎండీఏ సూచించింది. కర్ఫ్యూ అమలులో ఉన్న వేళల్లో ఓఆర్​ఆర్​పై కార్లను అనుమతించడం జరగదని అధికారులు స్పష్టం చేశారు. ఓఆర్​ఆర్​పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల్లో ప్రయాణికులున్నట్లుగా టోల్​ ప్లాజా సిబ్బంది గుర్తిస్తే.. స్థానిక పీఎస్​కు సమాచారం అందించాలని హెచ్​ఎండీఏ అధికారులు ఆదేశించారు.

వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్‌ఎండీఏ సూచించింది. కర్ఫ్యూ అమలులో ఉన్న వేళలు ఉదయం 7నుంచి రాత్రి 7గంటల వరకు ఓఆర్‌ఆర్‌పై కార్లను అనుమతించడం జరగదని అధికారులు స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల్లో ప్రయాణికులున్నట్లుగా టోల్‌ ప్లాజా సిబ్బంది గుర్తిస్తే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని హెచ్‌ఎండీఏ అధికారులు ఆదేశించారు.

ఇదీ చూడండి.. ఆ వయసులోనే 'సీత'కు తారక్ లవ్​ లెటర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.