Letter to KRMB: ఆర్డీఎస్కు సంబంధించి అన్ని అంశాలను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును.. తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈమేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కి లేఖరాశారు. హెడ్‌రెగ్యులేటర్, రాజోలి వాగు మధ్యపూడిక, ఇసుకను... పూర్తిగా తొలగించే వరకు అధ్యయనం చేయాలని లేఖలో కోరారు. ప్రస్తుత పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆర్డీఎస్ కాల్వహెడ్ రెగ్యులేటర్‌తో పాటు... కర్ణాటక, తెలంగాణ సరిహద్దులోని 42.60 కిలోమీటర్ వద్ద ఉమ్మడి కాల్వ నిర్ధేశిత 770 క్యూసెక్కుల నీటిని తీసుకునే అవకాశం ఉందో లేదో పరిశీలించాలని... బోర్డుకు విజ్ఞప్తి చేశారు.
పూర్తిస్థాయి నీరు వచ్చేలా ఆధునీకరణ పనుల్లో భాగంగా ఆర్డీఎస్ ఎఫ్‌టీఎల్ పెంపును పరిశీలించాలని లేఖలో మురళీధర్ కోరారు. తదుపరి చర్యలు తీసుకునేముందు ఆ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కేఆర్ఎంబీకి ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్మించిన గురురాఘవేంద్రసహా 13 ఎత్తిపోతల పథకాలపై... బోర్డుకు రాష్ట్రప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈఎన్సీ మరో లేఖ రాశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్డీఎస్ దిగువ నుంచి సుంకేశుల వరకు... ఎత్తిపోతల పథకాలను చేపట్టారని అందులో పేర్కొన్నారు. అనుమతులు పొందేవరకు గురు రాఘవేంద్ర సహా అన్ని ఎత్తిపోతల పథకాలకు తుంగభద్ర జలాలు తీసుకోకుండా చూడాలని బోర్డును కోరారు. ఎత్తిపోతల పథకాల ద్వారా ఇప్పటివరకు వినియోగించిన నీరు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమచేయాలని లేఖలో ఈఎన్సీ మురళీధర్ కోరారు.
ఇదీ చూడండి: