Covid Guidelines: ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలను దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణ చట్టం కింద ఆంక్షలు అమలు చేయనుంది. వచ్చే నెల రెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించారు.
కొన్ని నియంత్రణా చర్యలతో జనసమూహం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఆయా కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. వేదికల ప్రవేశద్వారాల థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది.
మాస్క్ తప్పనిసరి, లేకుంటే వెయ్యి ఫైన్
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించే విషయమై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఉత్తర్వు ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తాజా ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:
CJI In Christmas Celebrations: నోవాటెల్లో క్రిస్మస్ వేడుకలు.. పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ