ETV Bharat / city

ఏపీ సచివాలయ ఉద్యోగులకు తెలంగాణ అనుమతి - తెలంగాణ సీఎస్​కు ఏపీ సీఎస్ లేఖ

ఏపీ సచివాలయ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్​డౌన్ కారణంగా ఆ రాష్ట్రంలో చిక్కుకుపోయిన వారిని ఏపీకి పంపేందుకు అనుమతిచ్చింది. వీరంతా బుధవారం ఉదయం అమరావతికి తరలివెళ్లనున్నారు.

telangana-government-has-allowed-ap-employees-to-go-to-amravathi

author img

By

Published : May 26, 2020, 9:56 PM IST

లాక్​డౌన్ కారణంగా తెలంగాణలో చిక్కుకున్న ఏపీ సచివాలయ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. తమ ఉద్యోగులను ఏపీకి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్ సోమేష్​కుమార్​కు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. 400 మంది ఏపీ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎస్ కోరారు. హైదరాబాద్​లోని మియాపూర్, కూకట్ పల్లి, హౌసింగ్ బోర్డు కాలనీ, లక్డీకాపుల్, ఎల్బీ నగర్​ల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఉద్యోగులు అమరావతి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎస్ కోరారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బుధవారం తెల్లవారుజామున రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వం కేటాయించిన 10 బస్సుల్లో రాష్ట్రానికి బయలుదేరనున్నారు.

అందరికీ పరీక్షలు చేయండి

మరోవైపు సచివాలయ ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని సచివాలయ ఉద్యోగుల సంఘం కోరింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వారితోపాటు అందరికీ పరీక్షలు చేయాలని విజ్ఞప్తి చేసింది. దీనివల్ల 3 వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి

వైకాపా ఎంపీ, మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.